ETV Bharat / bharat

200కేజీల బరువు.. ఇద్దరు భార్యలు.. ఈ భారీకాయుడి మెనూ చూస్తే.. - రఫీక్​ అద్నాన్​

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఫిట్​గా ఉండాలని కోరుకుంటారు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు మూలమైన ఊబకాయానికి దూరంగా ఉండాలనుకుంటారు. కానీ.. అధిక బరువు ఉంటే చాలా సమస్యలు వస్తుంటాయి. ఓ వ్యక్తి ఏకంగా 200 కిలోలకుపైనే ఉన్నాడు. నడవడం కూడా చాలా కష్టం. ఎటు వెళ్లాలన్నా బుల్లెట్టే దిక్కు. రోజుకు 15 కిలోల ఆహారం పొట్టలోకి వెళ్లాల్సిందే. అతడే.. బిహార్​ కటిహార్​కు చెందిన రఫీక్​ అద్నాన్​. ఇక అతడి ఆహారపు అలవాట్ల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..

obesity patient
రఫీక్​ అద్నాన్​
author img

By

Published : Jun 12, 2022, 3:21 PM IST

Updated : Jun 12, 2022, 3:55 PM IST

అతడు​ ప్రజాప్రతినిధి కాదు.. ఊరి పెద్ద అంతకన్నా కాదు.. కానీ ఓ ప్రత్యేక కారణంతో చుట్టుపక్కల పదూళ్ల ప్రజలందరికీ తెలుసు. దీని వెనుక కారణం ఊబకాయం. అవును.. బిహార్​లోని కటిహార్ జిల్లా జయనగర్​కు చెందిన రఫీక్​ అద్నాన్​ బరువు 200 కిలోలకుపైనే. ఇదే ఇప్పుడు అతడికి పెద్ద సమస్యగా పరిణమించింది. ఎటూ కదల్లేక ఎన్నో కష్టాలు పడుతున్నాడు. పెళ్లై ఇద్దరు భార్యలున్నా.. పిల్లలు కూడా కలగలేదు. దానికీ ఇతడి అతిబరువే కారణం.

obesity patient
రఫీక్​ అద్నాన్​

అద్నాన్​ మెనూలో ప్రతిరోజూ.. 3 కిలోల రైస్​, నాలుగు కేజీల పిండితో చేసిన రోటీలు, రెండు కిలోల చికెన్​, కిలోన్నర చేపలు, 3 లీటర్ల చొప్పున పాలు ఉండాల్సిందే. ఇలా మొత్తం రోజులో సుమారు 14-15 కేజీల ఆహారం భుజిస్తాడు. అంతే మొత్తంలో మంచినీరు తాగాల్సిందే. చిన్నప్పటి నుంచే బరువుండేవాడినని, కానీ ఇప్పుడు అతి బరువుతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు రఫీక్​ చెప్పుకొచ్చాడు.

obesity patient
రఫీక్​ అద్నాన్​

''చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఇంకా భారీగా బరువు పెరిగాను. అధిక బరువు కారణంగా బుల్లెట్​పై వెళ్లటం కూడా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు 200 కేజీలు ఉన్నాను. చాలా ఇబ్బందులు పడుతున్నాను. నాకు పెళ్లయింది కానీ పిల్లలు లేరు. అధిక బరువే అందుకు కారణం. రెండు క్వింటాళ్ల బరువు కారణంగా నడవలేకపోతున్నా. రోటీ, అన్నం, మాంసం తింటాను.''

- రఫీక్​ అద్నాన్​, స్థూలకాయుడు

నడవడం కూడా కష్టంగా మారినందున ఎటు వెళ్లాలన్నా బండే దిక్కు.​ రఫీక్​ బరువును తట్టుకోవడం మామూలు బైక్ వల్ల సాధ్యం కావడం లేదని.. బుల్లెట్ బండి కొనుక్కున్నాడు. కానీ.. అది కూడా అప్పుడప్పుడు మొరాయిస్తోంది. స్థూలకాయం కారణంగా రఫీక్​.. స్థానికుల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాడు. భోజనం మొత్తం తినేస్తాడని.. పెళ్లిళ్లకు, ఇతర వేడుకలకు కూడా రఫీక్​ను ఎవరూ పిలవడం లేదు. అయితే.. స్వతహాగా రైతు అయిన అద్నాన్​కు ఆర్థిక సమస్యలు పెద్దగా లేవు. ధాన్యం వ్యాపారం కూడా ఉంది.

obesity patient
భారీకాయుడి రఫీక్​ అద్నాన్​
రఫీక్.. ​ బులీమియా నెర్వోసా అనే వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పాడు స్థానిక వైద్యుడు మృణాల్​ రంజన్. ఇదో ఈటింగ్​ డిసార్డర్​ అని, అలాంటివారు భారీ పరిమాణంలో తింటారని వివరించాడు.

బులీమియా నెర్వోసా అంటే?: బులీమియా నెర్వోసా వ్యాధి ఎక్కువగా జన్యుపరంగా వస్తుంది. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా కలుగుతుంది. దీని కారణంగా వ్యక్తి ప్రవర్తన మారుతుంది. భయాందోళనలకు గురవుతాడు. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని వైద్యులు చెబుతున్నారు. చుట్టుపక్కల అలాంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే.. డాక్టర్లకు చూపించాలని సూచిస్తున్నారు. డైటీషియన్​, సైకియాట్రిస్ట్​ సహా కౌన్సిలింగ్​ కూడా అవసరమని అంటున్నారు. మెరుగైన చికిత్స, వైద్యుల పర్యవేక్షణ, సరైన ఆహార ప్రణాళికతో దీనిని నయం చేయవచ్చని చెబుతున్నారు.

ఇదీ చూడండి: భుజంపై మేనకోడలి మృతదేహం.. గుండెల నిండా దుఃఖం.. అంబులెన్స్​ లేక 5 కి.మీ. అలానే..

మహిళ ముఖంపై బ్లేడుతో దాడి.. 118 కుట్లు.. రంగంలోకి సీఎం!

Last Updated : Jun 12, 2022, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.