ETV Bharat / bharat

అమ్మాయిలకు ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్లు- కాంగ్రెస్​ బంపర్​ ఆఫర్​! - నవజ్యోత్ సింగ్ సిద్ధూ హామీ

Punjab Assembly Polls: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. కళాశాలకు వెళ్లే అమ్మాయిలకు బంపర్​ ఆఫర్​ ప్రకటించారు. లూధియానాలో అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ స్కూటర్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Navjot Singh Sidhu
నవ్​జ్యోత్ సింగ్ సిద్ధు
author img

By

Published : Jan 23, 2022, 5:51 AM IST

Updated : Jan 23, 2022, 6:47 AM IST

Punjab Assembly Polls: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో యువతను ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్​ ప్రకటించారు పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. కళాశాలకు వెళ్లే అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. లూధియానాలో అభివృద్ధి చేసిన ఈ-స్కూటర్లు ఇస్తామని శుభవార్త చెప్పారు.

ఈ ప్రకటన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సిద్ధూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే అంశాలపై అవి ఎప్పుడూ దృష్టిపెట్టవని అన్నారు. రాష్ట్ర​ ఆర్థికాభివృద్ధి దృష్ట్యా.. 'పంజాబ్ మోడల్​'లో భాగంగా.. లూధియానాను పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. లూధియానాతో పాటు మొహాలీని ఐటీ హబ్​గా, కపుర్తలా- బటాలాను ఫౌండ్రీ క్లస్టర్​గా, పటియాలాను ఫుడ్​ ప్రాసెసింగ్ హబ్​గా, అమృత్​సర్​ను మెడికల్ అండ్ టూరిజం హబ్​గా, మలౌట్, ముక్త్​సర్​ను వస్త్ర పరిశ్రమ, వ్యవసాయ రంగ ఉత్పత్తుల క్లస్టర్​గా మారుస్తామని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:

పంజాబ్​ కాంగ్రెస్​ సీఎం అభ్యర్థి చన్నీ! ఆ ట్వీట్​కు​ అర్థం అదేనా?

కేజ్రీవాల్​పై పంజాబ్ సీఎం పరువు నష్టం దావా!

పంజాబ్​లో ఎవరి బలం ఎంత? అమరీందర్ మేజిక్ చేసేనా?​

Last Updated : Jan 23, 2022, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.