ETV Bharat / bharat

బెడ్​షీట్​పై 'పీరియడ్స్'​ మరకలు.. హోటల్ యాజమాన్యం పనికి ప్రొఫెసర్​ షాక్! - పీరియడ్స్​ స్టెయిన్స్​

Period Stains in Bedsheet: మహిళల్లో పీరియడ్స్​ అనేది సాధారణ ప్రక్రియ. దీనిపై సమాజంలో అందరికీ అవగాహన కలిగించేందుకు కేంద్రం, ఎన్​జీఓలు కృషి చేస్తుంటే.. మరోవైపు బంగాల్​ మెదినీపుర్​లో ఓ షాకింగ్​ ఘటన వెలుగుచూసింది. బెడ్​షీట్​పై 'రుతుస్రావం' రక్తపు మరకలు ఉన్నాయని హోటల్​ యాజమాన్యం.. ఓ మహిళా ప్రొఫెసర్​ నుంచి అదనంగా డబ్బులు వసూలుచేసింది. దీనిపై దుమారం రేగుతోంది.

Professor fined at hotel for period stains in bedsheet

author img

By

Published : May 10, 2022, 10:12 AM IST

Period Stains in Bedsheet: రక్తం మరకలు ప్రతి మహిళ జీవితంలోనూ భాగమే. నెలసరి ప్రారంభమైనప్పటి నుంచి మెనోపాజ్ దశ చేరేవరకు కనీసం ఒక్కసారైనా రక్తం మరకలు దుస్తులకు అంటనివారుండరంటే అతిశయోక్తి కాదేమో! ఈ పీరియడ్స్ (రుతుచక్రం) అనేది మహిళ శరీరంలో జరిగే ఒక సాధారణమైన ప్రక్రియే. వీటి గురించి మహిళలు బహిరంగంగా మాట్లాడటం ఇటీవలి కాలంలో పెరిగింది. కేంద్రం, ఎన్​జీఓల అవగాహన కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైంది. ఇలాంటి తరుణంలో బంగాల్​ పశ్చిమ మెదినీపుర్​లోని ఓ హోటల్​ యాజమాన్యం.. మహిళ పట్ల ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఉన్న గదిలో బెడ్​షీట్​పై పీరియడ్స్​కు సంబంధించి రక్తపు మరకలు ఉన్నాయని అదనంగా డబ్బులు వసూలుచేశారు హోటల్​ సిబ్బంది.

కోల్​కతాలోని ఓ కాలేజీలో ప్రొఫెసర్​గా పనిచేసే మహిళ ఆదివారం రాత్రి తన అంకుల్​తో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఓ​ యాప్ ద్వారా.. హోటల్​లో రూం బుక్​ చేసుకున్నారు. సోమవారం ఉదయం గది ఖాళీ చేసి వెళ్తుండగా.. బిల్లు చూసి షాకయ్యారు. అదనంగా రూ. 400 ఎక్కువ అడగటం చూసి.. వారిని ప్రశ్నించగా వివాదం మొదలైంది.

''నేను హోటల్​ను ఖాళీ చేసి వెళ్తున్న సమయంలో బిల్లు ఇచ్చారు. లాండ్రీ సెక్టార్​ రూ. 400 అదనంగా వేయడం చూసి షాకయ్యా. బెడ్​షీట్​పై రుతుస్రావానికి సంబంధించి రక్తపు మరకలు ఉన్నాయని చెప్పారు. 'వాటిని ఉతకలేం, పడేయలేం.. అందుకే అదనంగా ఛార్జి చేస్తున్నాం' అన్నారు. ఒకవేళ బెడ్​షీట్​పై టొమాటో కెచప్​ లేదా ఇంకేదైనా పడితే నానుంచి ఇలాగే అదనంగా డబ్బు వసూలు చేసేవారా? అస్వస్థతతో బెడ్​పై వాంతులు చేసుకుంటే.. ఇలాగే చేస్తారా? అని ప్రశ్నించా.''

- బాధిత మహిళ

అయితే హోటల్​ యాజమాన్యాన్ని ఫోన్​లో సంప్రదించగా వారు స్పందించారు. 'హోటల్​కు వచ్చే వారి వల్ల ఏదైనా ఆస్తినష్టం జరిగితే.. డబ్బులు తీసుకుంటామని నిబంధనల్లో ఉంది.' అని స్పష్టం చేశారు నిర్వాహకులు. అతిథుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా, హోటల్​ గదులు పరిశుభ్రంగా ఉండేలా చూడటం తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు.

ఇవీ చూడండి: రుతుచక్రం గుట్టు విప్పుదాం..!

ఆ కంపెనీలో మహిళలకు 12 రోజులు పీరియడ్ లీవ్స్

ప్రతినెలా నెలసరి సక్రమంగా.. రావాలంటే?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.