ETV Bharat / bharat

పశువుల్ని కట్టేసే ఉద్యోగానికి పీజీ చేసిన 'టక్​ జగదీశ్​'లు.. ఐటీ జాబ్ వదిలి మరీ.. - వెటెర్నరీ కేర్​ అసిస్టెంట్

Cattle Handler in Formal Dress: ఫార్మల్​ దుస్తులు ధరించిన ఓ యువకుడు అక్కడే ఉన్న పశువును నడిపిస్తూ ఓ చెట్టుకు వద్దకు తీసుకొచ్చి దానిని కట్టేశాడు. ఆ పని పూర్తి అయ్యేవరకు అతనికి టెన్షన్​.. ఎక్కడ ఫెయిల్​ అవుతానో అని. అక్కడకు వచ్చిన మిగతా అభ్యర్థులది కూడా ఇదే పరిస్థితి. వెటర్నరీ కేర్​ అసిస్టెంట్​ పోస్ట్​ కోసం నిర్వహించిన పరీక్షల సందర్భంగా కనిపించిన హడావుడే ఇదంతా. ఇంతకీ ఇది ఎక్కడంటే?

Cattle Handler in Formal Dress
ఫార్ముల్​ దుస్తుల్లో పశువుల
author img

By

Published : Apr 10, 2022, 2:34 PM IST

Updated : Apr 10, 2022, 3:28 PM IST

Cattle Handler in Formal Dress: సాధారణంగా ఇంటర్వ్యూలకు అభ్యర్థులు ఫార్మల్​ దుస్తుల్లో వస్తుంటారు. కానీ ఇలాంటి దుస్తులు ధరించి పశువులను నడిపించడం, వాటి బాగోగులు చూస్తుండటం ఎక్కడైనా చూశారా? తమిళనాడులోని వెల్లూరు జిల్లా స్థానిక వెటర్నరీ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. వెటర్నరీ కేర్​ అసిస్టెంట్​ ఉద్యోగం కోసం అక్కడి యువత పోటీపడుతోంది.

d
పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులు

జిల్లాలో 22 పోస్టులకు 2015లోనే నోటిఫికేషన్ జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే ఓ కోర్టు కేసు కారణంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. ఆ తర్వాత కరోనా కారణంగా ఇది మరింత ఆలస్యమైంది. మొత్తానికి సుమారు ఏడేళ్ల తర్వాత ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదో తరగతి పాస్ అయినా, ఫెయిల్ అయినా.. ఈ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు అర్హులే. 22 పోస్టుల కోసం దాదాపు 5000 మంది పోటీపడుతున్నారు. వీరిలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్​గ్రాడ్యుయేట్లు, ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారు.

d
పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులు
Cattle Handler in Formal Dress
వెటర్నరీ కేర్​ అసిస్టెంట్​ ఉద్యోగం కోసం అభ్యర్థుల పోటీ

రోజుకు 800 మందికి చొప్పున జరుగుతున్న ఈ పరీక్షలకు చాలా మంది ఫార్మల్​ దుస్తులు ధరించి వస్తున్నారు. సైకిల్​ తొక్కడం, పశువును కట్టడం, పశువుల సంరక్షణ వంటివి పరీక్షలో భాగం. వీటితో పాటు కొన్ని సామాజిక విషయాలపైన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఉద్యోగ భద్రత, నెలవారీ టార్గెట్లు వంటి ఒత్తడి లేకపోవడం, సొంతూరులోనే పనిచేసుకునే అవకాశం ఉండటం వల్లే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నామని అంటున్నారు అభ్యర్థులు.

ఇదీ చూడండి : సినిమా స్టైల్​లో ఛేజింగ్.. 22కి.మీ టైర్​ లేకుండానే ప్రయాణం

Last Updated : Apr 10, 2022, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.