- లోక్‌సభలో వీగిన విపక్షాల అవిశ్వాస తీర్మానం
- మూజువాణి ఓటుతో వీగిన విపక్షాల అవిశ్వాస తీర్మానం
- ఓటింగ్‌కు ముందే సభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు
- లోక్‌సభ రేపటికి వాయిదా
PM Modi Today Speech : 'విపక్షాల కళ్లు మూసుకుపోయాయ్.. 'ఇండియా' కూటమికి త్వరలోనే 'తాళం'' - మోదీ ప్రసంగం
19:28 August 10
19:23 August 10
- భారత ఆత్మవిశ్వాసాన్ని, అభివృద్ధిని ప్రపంచం గుర్తించింది.. ఇది భారతీయ ప్రజల విజయం
- నాపై ఎన్ని విమర్శలు చేసినా.. ఎన్ని అసందర్భ ప్రేలాపనలు చేసినా నన్ను గాయపర్చలేవు
- వ్యక్తిగా నన్ను అవమానపర్చాలనుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా
- మణిపుర్‌లో జరిగింది అమానవీయం.. దాన్ని రాజకీయం చేయడం తగదు
- మరో ఘటన జరగకుండా అందరం కలిసి నిబద్ధతతో పనిచేస్తేనే దేశం ముందడుగు వేస్తుంది
- మణిపుర్ అంశం ముందుపెట్టి అవిశ్వాసం ప్రకటించారు.. అది మేము చేసిన పని చెప్పుకునే అవకాశం కల్పించింది
- మరోసారి జాతి ప్రయోజనాలు పణంగా పెట్టే అవిశ్వాసాలు రావని భావిస్తున్నాం
19:19 August 10
- 2018 తర్వాత 2023లో అవిశ్వాసం పెట్టారు.. కనీసం పెట్టేదైనా సరిగ్గా పెట్టవచ్చు కదా
- అవిశ్వాసానికి ఎందుకు పెడుతున్నారనేదానికి స్పష్టత లేదు.. సంసిద్ధత లేదు
- మరోసారి అవిశ్వాసం పెట్టినప్పుడైనా సంపూర్ణమైన సంసిద్ధతతో వస్తారని ఆశిస్తున్నా
- సభ ప్రజల సొమ్ముతో నడుస్తోంది.. ప్రతిక్షణం అత్యంత విలువైనది
- ప్రజల ధనాన్ని.. సభా సమయాన్ని దుర్వినియోగం చేయకూడదు
- రాజకీయాలు బయట చేయాలి.. సభలో కాదు
- దేశ అభివృద్ధి, సమగ్రత కోసం సభలో చర్చలు జరగాలి
- దేశ అభివృద్ధి, సమాజ సేవ కోసం ఆత్మబలిదానానికి కూడా వెనుకాడని వారసత్వం నుంచి మేము వచ్చాం
- వ్యక్తుల కన్నా దేశానికే తొలి ప్రాధాన్యమనేది మా ఆలోచన విధానం
- నేటి భారతం ఒత్తిళ్లకు తలొగ్గదు.. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది
19:12 August 10
- కాలం మారింది.. ఈశాన్య రాష్ట్రాలు దేశానికి కొత్త ఆర్థిక వ్యవస్థలుగా మారుతున్నాయి
- ఆగ్నేయ ఆసియాతో భారత్ అనుసంధానానికి పట్టుకొమ్మలు ఈశాన్య రాష్ట్రాలు
- ఈశాన్య రాష్ట్రాల్లో నూతన రహదారులు, రైల్వే వ్యవస్థ, విమానాశ్రయాలు వస్తున్న విషయం కనబడట్లేదా?
- భారతీయ రైల్వే వ్యవస్థతో మణిపుర్ అనుసంధానమైన విషయం మీకు కనబడట్లేదా?
- ఈశాన్య రాష్ట్రాల ప్రజలను ఎన్డీఏ ప్రభుత్వం ఎలా గౌరవిస్తోందో మీకు గుర్తు రావట్లేదా?
- కాంగ్రెస్ వాళ్లు మణిపుర్, నాగాలాండ్, మిజోరాంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేకపోతున్నారా?
- మా సమయం, శ్రమ సంపూర్ణంగా దేశం కోసమే.. ప్రతిక్షణం మా ఆలోచన, వివేచన దేశాభివృద్ధి కోసమే
- అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు.. మీరు కళ్లు తెరిచి చూడండి అభివృద్ధి ఏంటో కనబడుతుంది
19:09 August 10
- విభజన రాజకీయాలతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరంతరం మంటలు రేపింది
- ఈశాన్య రాష్ట్రాల్లో ఇష్టానుసారం ప్రభుత్వాలను మార్చడం, సీఎంలను మార్చడం అనేక సమస్యలను సృష్టించింది
- మహాత్మాగాంధీ ఫొటో పెట్టలేని పరిస్థితి కాంగ్రెస్‌కు గుర్తుండే ఉంటుంది
- మణిపుర్‌లో జాతీయగీతం పాడలేని పరిస్థితులు ఉండేవి
- ఈ పరిణామాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు నడిపింది కాంగ్రెస్ కాదా
- మణిపుర్‌లో సాయంత్రం 4 తర్వాత ఆలయాలు మూసి సైన్యం పహారా కాసేది.. అది కాంగ్రెస్‌కు గుర్తు లేదా?
- మణిపుర్ తీవ్రవాదానికి కారణం ఎవరో.. కారకులు ఎవరో కాంగ్రెస్‌కు గుర్తులేదా?
- కాంగ్రెస్‌కు రాజకీయాలు తప్ప.. ప్రజల బాగోగులు పట్టించుకున్న సందర్భమేమైనా ఉందా
- కాంగ్రెస్ ప్రభుత్వాల్లో నిరంతర బంద్‌లు, బ్లాకేడ్‌లు జరిగిన సందర్భాలు విపక్షాలు మరిచిపోయాయా
- రోజుల తరబడి రహదారులను దిగ్బంధం చేసిన కాలాన్ని విపక్షాలు మరిచిపోయాయా.. అప్పుడు అధికారంలో ఉంది ఎవరు
- మణిపుర్‌లో తీవ్రవాదం పరాకాష్టకు చేరినపుడు అధికారంలో ఉంది ఎవరు
19:04 August 10
- లోహియా శిష్యులమని చెప్పుకునేవాళ్లకు.. లోహియా ఏం చెప్పారో మీకు గుర్తుందా
- ఈశాన్య భారతాన్ని ఉద్దేశపూర్వకంగా నెహ్రూ అభివృద్ధి చేయట్లేదని ఆరోపించారు
- 30 వేల చదరపు మైళ్ల ప్రాంతాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచారని నెహ్రూపై ఆరోపణలు చేశారు
- లోహియా చేసిన ఆరోపణలు .. లోహియా అనుచరులమని చెప్పుకునేవాళ్లకు గుర్తున్నాయా?
- ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఎప్పుడు ప్రారంభమైంది.. దానికి కారకులెవరని మీరెప్పుడైనా గ్రహించారా
- ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కాంగ్రెస్ ఎప్పుడైనా చిత్తశుద్ధితో పనిచేసిందా
- కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను ఎప్పుడైనా అక్కున చేర్చుకున్నాయా?
- తొమ్మిదేళ్ల నుంచి మేము చేస్తున్న అభివృద్ధి అనుభవంతో చెబుతున్నా.. ఈశాన్య రాష్ట్రాలు మాకు అత్యంత ప్రాధాన్యమైనవి
- ఈశాన్య రాష్ట్రాల సమస్యలన్నింటికీ కాంగ్రెస్సే మూల కారణం
- కాంగ్రెస్ చేసిన కుటిర రాజకీయాలే ఈశాన్య రాష్ట్రాల్లో నిరంతర సమస్యలకు కారణమయ్యాయి
18:58 August 10
ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. అవిశ్వాసంపై ప్రధాని మోదీ లోక్‌సభలో సమాధానమిస్తున్నారు. కాంగ్రెస్ సహా విపక్షాలను ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రధాని మాట్లాడుతుండగానే ఇండియా కూటమి ఎంపీలు లోక్‌సభ నుంచి బయటకి వెళ్లిపోయారు.
18:57 August 10
- దేశాన్ని ఏకీకృతం చేయాల్సిన బాధ్యత ఏనాడు తీసుకోలేదు
- ఓట్ల రాజకీయాల కోసం దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విభజన చేశారు
- కాంగ్రెస్ చరిత్ర అంతా భరతమాతను చిన్నాభిన్నం చేయడంలోనే మునిగిపోయింది
- ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు
- ఓట్లు, రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది
- భారత్‌లో కాంగ్రెస్ అరాచకాలు చెప్పుకుంటే అనేకం
- మిజోరాం మీద జరిగిన వాయుసేన దాడి మర్చిపోయినట్లున్నారు
- మార్చి 5న ఇప్పటికీ మిజోరాం.. నిరసన దినంగా భావిస్తుంది
- ఇందిరా హయాంలో మిజోరాంపై జరిగిన వాయుసేన దాడిని కాంగ్రెస్ ఇప్పటిదాకా దాచిపెట్టింది
- ఆరోజు మిజోరాం ప్రజలపై జరిగిన దాడి గాయం ఇప్పటికీ మానలేదు
18:52 August 10
- భారతమాత పట్ల ప్రతిపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా
- అధికారం లేకుండా విపక్షాలు జీవించలేవు.. అధికారం కోసమే విపక్షాల ప్రయాసంతా
- భారతమాత మరణం గురించి మాట్లాడటమంటే దేశ వినాశనాన్ని కోరుకున్నట్లే
- ఒకసారి భారతమాత హత్య అంటారు.. మరోసారి రాజ్యాంగం హత్య అంటారు.. ఎలాంటి భాష ఇది
- ఇది ఇవాళ కొత్తగా వచ్చిన సంస్కారం కాదు.. వందేమాతరాన్ని ముక్కలుముక్కలుగా చేసిననాడే వీళ్ల ఉద్దేశాలు బయటపడ్డాయి
- బుజ్జగింపు విధానాలతోనే దేశానికి ముప్పు తెచ్చిపెట్టారు
18:46 August 10
- మణిపుర్‌పై సంపూర్ణ చర్చ జరగాలనే ఆలోచన విపక్షాలకు లేదు
- మణిపుర్‌లో ఏం జరిగిందో నిన్న అమిత్‌షా వివరంగా చెప్పారు
- మణిపుర్‌లో జరిగింది మళ్లీ జరగకుండా అందరం కలిసి ఒక నిర్ణయానికి రావాలనే ఆలోచన విపక్షాలకు లేదు
- మణిపుర్ పరిణామాలపై హోంమంత్రి నిన్న రాజకీయాలతో సంబంధం లేకుండా 2 గంటలపాటు వివరించారు
- ఈ పరిణామాలన్నింటిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు
- మణిపుర్ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత గురించి అమిత్‌షా సవివరంగా సభ ముందుంచారు
- విపక్షాలకు మణిపుర్ ప్రజలపై ప్రేమకన్నా.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచన ఎక్కువ
- మణిపుర్‌లో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.. ప్రజల మధ్య పరస్పర విశ్వాసం నశించింది
- మహిళలకు ఘోర అవమానం జరిగింది.. అది మనందరికీ తలవంపులే
- మణిపుర్‌లో శాంతి నెలకొంటుందని సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని సంపూర్ణ విశ్వాసంతో సభకు హామీ ఇస్తున్నా
- ఈ సభ, దేశం సంపూర్ణంగా మణిపుర్ ప్రజలకు అండగా నిలుస్తుంది
- స్పర్ధలను వీడి మణిపుర్ తిరిగి అభివృద్ధి బాట పడుతుందన్న విశ్వాసం నేను సభకు ఇస్తున్నా
18:39 August 10
- కాంగ్రెస్ వాళ్ల కష్టాలు చూసి మాకు కాస్త జాలి వేస్తోంది.. పనికి రాదనుకున్న వస్తువును మళ్లీ మళ్లీ లాంచ్ చేస్తున్నారు
- పనికిరాని వస్తువును ఎన్నిసార్లు లాంచ్ చేసినా పబ్లిక్ పట్టించుకోరు
- రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్ష వ్యాఖ్యలు
- పబ్లిక్ పట్టించుకోకపోతే కాంగ్రెస్ జనాన్ని దోషులుగా చేస్తుంది
- జనం మెచ్చని వస్తువులను ఎన్నిసార్లు లాంచ్ చేసినా ఆదరణ దొరకదు.. ఇప్పుడు చేసేది మరో విఫలయత్నం
- రాజకుమారుడు కారు అద్దం దించి దేశంలో సమస్యలు ఇప్పుడిప్పుడే చూస్తున్నారు
- ప్రజల కష్టాలు, నష్టాలు చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు
- దేశాన్ని 50 ఏళ్లు పాలించింది ఆ రాజవంశమే అన్న స్పృహ ఆయనకు ఇంకా వచ్చినట్లు లేదు
- ఇప్పడు ఏర్పాటు చేసిన INDIA దుకాణానికి కూడా త్వరలో తాళం పడుతుంది
- అహంకారపూరిత సంకీర్ణం దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది
- ఈ సంకీర్ణం దేశ ఆర్థిక వ్యవస్థలను నష్టపరచాలని చూస్తోంది
18:34 August 10
- లంకను తగులబెట్టింది హనుమంతుడు కాదు.. లంకేయుల అహంకారం
- ఆ విషయం కాంగ్రెస్‌కు నూటికి నూరు శాతం సరిపోలుతుంది
- 400 సీట్ల నుంచి 40 సీట్లకు వచ్చిన ఘనత కాంగ్రెస్‌దే
- ఈ లంకా దహనం ఎవరు చేశారో వాళ్లే తేల్చుకోవాలి
- ప్రధానమంత్రి మా వారసత్వ హక్కు.. ఎవరో వచ్చి ప్రధాని పదవిలో కూర్చుంటారా? అనే అహంకారం మిమ్మల్ని వీడట్లేదు
- ఎదుటివాళ్లను గౌరవించే సంస్కారం కాంగ్రెస్‌కు లేదు.. రాదు కూడా
- కాంగ్రెస్ వాళ్లు ఏం చేశారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి
- పుట్టినరోజు వేడుకలకు యుద్ధనౌకలు వాడుకున్నారు
- చీరలకు డ్రైక్లీనింగ్ కోసం అధికారిక విమానాలను వినియోగించారు
- హవాయి చెప్పులు వేసుకునే నిరుపేదలకు విమానం ఎక్కే అవకాశం దొరికింది.. మీరు పుట్టినరోజు వేడుకలు చేసుకున్న యుద్ధనౌకలు శరణార్ధుల రవాణాలో నిమగ్నమయ్యాయి
- కాలం మారింది.. మీ ఆటలు సాగవు.. పేదలదే రాజ్యం.. నిరుపేదలదే అధికారం
18:25 August 10
- అహంకారపూరిత సంకీర్ణం.. వారసత్వ పాలనకు ప్రతిబింబం
- వారసత్వ రాజకీయాల సమాహారమే ఇండియా పేరుతో వచ్చిన కొత్త సంకీర్ణం
- లోహియా, బోర్డొలోయ్, జేపీ, రాజేంద్రప్రసాద్ వంటి ఎందరో మహానుభావులు వారసత్వ రాజకీయాలు దేశానికి నష్టదాయకమని చెప్పారు
- జాతి నిర్మాణంలో వారసత్వ రాజకీయాలు అడ్డంకిగా మారుతాయని తొలి తరం మేధావులు చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయింది
- వారసత్వ రాజకీయాలు చేసేవాళ్లకు దేశంలో కాలం చెల్లిపోయింది
- కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన మేధావులను కూడా ఆ పార్టీ ఓడించి చూపింది
- కాంగ్రెస్‌ను ప్రశ్నించినందుకే అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించింది
- ఎమర్జెన్సీని ప్రశ్నించినందుకు జగ్జీవన్‌రామ్‌ను ఓడించింది
- జయప్రకాశ్ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి ఎంతోమంది నాయకులను కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది
- తొలితరం నాయకులందరినీ కాంగ్రెస్ విస్మరించింది
- కాంగ్రెసేతర ప్రభుత్వాలే తొలితరం మహానాయకులకు తగినంత గౌరవం కల్పించాయి
- మాజీ ప్రధానులందరినీ గౌరవించిన ఘనత ఎన్డీఏదే
- మాజీ ప్రధానులందరి కృషిని పీఎం మ్యూజియంతో ప్రజల ముందుంచుంది ఎన్డీఏ
18:24 August 10
- ఇతరుల కష్టాన్ని, విజయాలను ఖాతాలో వేసుకోవడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య.. 1920 నుంచి ఇదే కథ
- మూడు రంగుల జాతీయ జెండాను.. కాంగ్రెస్ జెండాగా మార్చుకుంది
- ఎన్నికల గుర్తులను కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చింది
- ఇది ఇండియా సంకీర్ణం కాదు.. అహంకారపూరిత సంకీర్ణం
- ఆ సంకీర్ణంలో ప్రతి ఒక్కరూ ప్రధాని కావాలనుకుంటారు
- 21 రాష్ట్రాల్లో ఒక్కోచోట ఒక్కో రకంగా ఈ పార్టీల సంకీర్ణం ఉంటుంది
- అక్కడ కలహించుకుంటారు.. ఇక్కడికి వచ్చి కలిసిపోతారు
- కేరళ, బంగాల్‌లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు పరస్పరం దాడులు చేసుకుంటారు.. ఇక్కడికి వచ్చి చేతులు కలుపుతారు
- మీ చర్యలు, మీ చేష్టలను దేశం గమనిస్తోంది
- మీరు చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారు
18:15 August 10
- NDAకు రెండు Iలు అదనంగా చేర్చి INDIA పేరుతో మళ్లీ 16 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి
- ఎన్ని కొత్త జట్లు కట్టినా ఓటమి ఖాయం.. ఆ విషయం గుర్తుపెట్టుకోండి
- INDIAలోని ఒక I.. 16 పార్టీల అహంకారానికి సూచిక.. మరొక I.. ఒక ప్రధాన కుటుంబ అహంకారానికి సూచిక
- మీ కూటమిలోనే భారత్ అస్తిత్వాన్ని ప్రశ్నించే వాళ్లు ఉన్నారు.. అలాంటి వారితో మీ బండి ఎలా కదులుతుంది
- ఒక పెద్ద పేరుతో దశాబ్దాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నారు.. వారి పని ఎక్కడా కనిపించదు
- ఆస్పత్రుల పేర్లు, క్రీడా అవార్డుల పేర్లు, రహదారుల పేర్లు అన్నింటికీ వారి పేర్లే
- ఆస్పత్రులకు వారి పేరు ఉంటుంది కానీ చికిత్స దొరకదు
- రహదారుల పేర్లు పెట్టుకుంటారు కానీ.. కొత్తవాటి నిర్మాణం ఆలోచించరు
- వారి పేరుతో అవార్డులు ఉంటాయి కానీ.. క్రీడాకారులకు ప్రోత్సాహం ఉండదు
- పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు ఉంటుంది ఆ కుటుంబం వ్యవహార శైలి
- ఆ కుటుంబం గురించి.. వాళ్ల అహంకారం గురించి చెప్పాలంటే చేంతాడంత ఉంది
18:06 August 10
- రాష్ట్రాలవారీగా కాంగ్రెస్ చివరిసారిగా ఎప్పుడు గెలిచిందో సభ ముందుంచిన ప్రధాని
- తమిళనాడు, బంగాల్, త్రిపుర, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాల్లో దశాబ్దాలుగా కాంగ్రెస్ ఓడిపోతూనే ఉంది
- ఆంధ్రప్రదేశ్, బంగాల్‌లో ఒక్క శాసనసభ్యుడు కూడా లేరు
- బెంగళూరులో మీరు యూపీఏకు ఇటీవల కర్మకాండ నిర్వహించారు
- కర్మకాండలను కూడా మీరు పండుగలాగా చేసుకుంటున్నారు
- యూపీఏ అనేది ముగిసిన అధ్యాయం.. మూలనపడ్డ బండికి రంగు వేయడం లాంటిది
- ఎన్ని రంగులు వేసినా.. పైపూతలు పూసినా బండి నడవదు
- మిమ్మల్ని గెలిపించకపోవడం ప్రజల అపరాధం కాదు.. మీరు చేసుకున్న కర్మ
17:57 August 10
- డిజిటల్ ఇండియా గురించి మాట్లాడినపుడు అవహేళన చేశారు.. జన్‌ధన్ గురించి మాట్లాడినపుడు అవహేళన చేశారు
- డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఏ స్థాయికి వెళ్లిందో మన కళ్లెదుటే కనబడుతోంది
- విపక్షాలకు ఆత్మ విశ్వాసం ఉండదు.. దేశీయులను నమ్మరు
- మన వ్యవస్థలకన్నా పాకిస్థాన్ చెప్పే మాటలపైనే విపక్షాలకు విశ్వాసం ఎక్కువ
- భారతీయ సైన్యం కంటే పాకిస్థాన్‌పైనే విపక్షాలకు నమ్మకం ఎక్కువ
- భారత్‌పై వచ్చే వ్యతిరేక ప్రచారానికే ప్రతిపక్షాలు ఎక్కువ విలువిస్తాయి
- భారత్ సామర్థ్యం మీద.. భారత ప్రజల సామర్థ్యం మీద విపక్షాలకు విశ్వాసం లేదు
- అహంకారంతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయి.. వాస్తవికతను జీర్ణించుకునే పరిస్థితులో లేరు
17:50 August 10
- ఒకసారి ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయికి ఎదుగుతుందో చూడండి
- అతి త్వరలో భారత్ ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది
- మేము తప్పులు చేస్తున్నామంటున్నారు కదా.. విపక్షాలు మీరేం చేస్తున్నారు.. మేము తప్పు చేస్తే సరైన దిశానిర్దేశం చేసే బాధ్యత విపక్షాలకు లేదా?
- మేం చేసే పనుల్లో తప్పుఒప్పులుంటే సూచనలు సలహాలు ఇచ్చే బాధ్యత మీకు లేదా?
- ఒక్కరోజైనా మీరు ఏం చేస్తున్నారు.. మీరు చేసే పనుల్లో మంచి చెడులేమైనా అడిగారా?
- మేము ఏమీ చేయకుండానే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందా?
- కాంగ్రెస్‌కు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఆలోచన లేదు.. స్థాయి లేదు
- కాంగ్రెస్‌కు ఆర్థిక వ్యవస్థ పట్ల.. దేశం పట్ల.. దిశదశ లేదు
- ప్రతిదాన్ని విమర్శించడం తప్ప ఆలోచన విధానం లేదు
- 1991లో భారత్.. అప్పుల కోసం ప్రపంచంవైపు చూసింది
- 2014 తర్వాత భారత్ స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుకుంది
- రిఫార్మ్, పెర్‌ఫామ్, ట్రాన్స్‌ఫామ్ అనే పద్ధతిలో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాం
17:43 August 10
- హెచ్‌ఏఎల్ అస్తిత్వాన్ని ప్రశ్నించారు .. హెచ్‌ఏఎల్ మునిగింది.. రక్షణ పరిశ్రమలు నాశనమయ్యాయని అన్నారు
- హెచ్‌ఏఎల్ మునిగిపోతోంది.. కార్మికులను భవిష్యత్తు లేదంటూ ఆందోళన చేశారు
- ఇప్పుడు హెచ్‌ఏఎల్ ఎలా ఉందో తెలుసా మీకు?.. హెచ్‌ఏఎల్ చరిత్రలో అత్యధిక ఆదాయం నమోదు చేసింది
- కార్మికులను రెచ్చగొట్టినా ఇవాళ హెచ్‌ఏఎల్ విజయపతాక ఎగురవేసింది
- మూడో ఉదాహరణ ఎల్‌ఐసీ.. ఎల్‌ఐసీ మునిగిపోతోంది.. పేదల పెద్దలకు కట్టబెడుతున్నారంటూ ప్రచారం చేశారు
- ఎల్‌ఐసీలోని పేదల సొమ్ముతో పెద్దలను కాపాడుతున్నారంటూ విషప్రచారం చేశారు
- స్టాక్‌మార్కెట్‌లో ఎల్‌ఐసీ విలువ చూసి మాట్లాడండి
- మీరు ఏవైతే మునిగిపోతున్నాయని అన్నారో అవి అద్భుత ఫలితాలిస్తున్నాయి
- అసలు మీకు.. ప్రజల మీద, దేశం మీద, వ్యవస్థల మీద విశ్వాసం లేదు
17:41 August 10
- మోదీకి సమాధి కట్టేస్తున్నారు.. మోదీకి సమాధి తవ్వుతున్నారంటూ అపభ్రంశాలు పలుకుతున్నారు
- అమంగళం, అపభ్రంశాలతో మోదీని ఆపలేరు
- విపక్షాలకు ఎదుటి వాళ్ల నష్టం కోరుకునే వరం లభించినట్లుంది
- మీరు ఎంత నష్టం కోరుకుంటే మారు అంత లాభం జరుగుతోంది.. తొమ్మిదేళ్లలో ఇది పదేపదే నిరూపితమైంది
- విపక్షాలు ఎప్పటికీ నిరాశ, నిస్పృహలు వెదజల్లుతుంటాయి.. మొదటి ఉదాహరణ బ్యాంకులు
- బ్యాంకులు మునిగిపోతున్నాయి.. బ్యాంకులు నాశనం అవుతున్నాయని శాపనార్ధాలు పెట్టారు
- బ్యాంకుల విషయంలో ఇప్పుడు ఏం జరిగింది?
- భారతీయ బ్యాంకులన్నీ మరింత బలోపేతమై లాభాల బాట పట్టాయి.. విపక్షాల అది కనిపిస్తోందో? లేదో?
17:35 August 10
- భారత్‌లో నిరుపేదలు, అతిపేదలు లేరని ఐఎంఎఫ్ పేర్కొంది
- 37 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐఎంఎఫ్ అధికారికంగా చెప్పింది
- శుభ్రత, పరిశుభ్రత విషయంలో భారత్ కృషిని డబ్ల్యూహెచ్‌వో ప్రశంసించింది
- లక్షలాది మందిని అంటువ్యాధుల నుంచి రక్షించిన విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా పేర్కొంది
- భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచమంతా చూస్తోంది
- ఇక్కడ ఉన్న విపక్షాలకు మాత్రం అభివృద్ధి కనబడట్లేదు
- విపక్షాల కళ్లు అహంకారంతో మూసుకుపోయాయి.. అభివృద్ధి కనిపించదు
- ప్రజలు పేదరికం నుంచి బయటకు రావడం విపక్షాలు చూడలేవు
- మూడు రోజులుగా విపక్షాలు వారి మనసులోని అక్కసంతా కక్కేశారు
- విపక్షాల మనసు కాస్త తేలికపడి ఉంటుంది
17:30 August 10
- తొమ్మిదేళ్లలో ఒక్క కుంభకోణం చూపించగలరా?
- సుపరిపాలన అన్న దానికి మేము నిదర్శనంగా నిలిచి గెలుస్తున్నాం
- ఆకాశం అంచులు దాటి ఆలోచిస్తున్న యువతకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం
- ప్రపంచ యవనికపై భారత్ పాత్ర కీలకంగా మారుతోంది
- ప్రపంచ అభివృద్ధిలో భారత భాగస్వామ్యం రోజురోజుకూ వృద్ధి చెందుతోంది
- భారత్ ఆత్మవిశ్వాసం ప్రపంచానికి మార్గదర్శనంగా నిలుస్తోంది
- భారత్ ఎంత బలంగా ఉందనడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనం
- భారత్.. పెట్టుబడులకు, అవకాశాలకు స్వర్గంగా మారుతోంది
17:28 August 10
- 21 వ శతాబ్దం భారత దేశానిది
- ఈ సమయం భారత్‌కు అత్యంత కీలకమైనది
- మీరు, మేము, కోట్లాది జనాభా అభివృద్ధికి సాక్షీభూతం
- భారత్ స్వప్నాలు సాకారమయ్యే కీలక శతాబ్దమిది
- 140 కోట్ల భారత జనాభా కలలు నెరవేరుతున్నాయి
- ఇలాంటి సమయంలో మనందరి సంకల్పం అభివృద్ధి కావాలి
- అభివృద్ధి అన్నది మనందరి తారకమంత్రం కావాలి
- మన విభేదాలు, వైరుధ్యాలు దాటి అభివృద్ధి మనందరి లక్ష్యం కావాలి
- యువతరం స్వప్నాలు సాకారం చేసి లక్ష్యసిద్ధికి పరుగెడుతోంది
- యువత లక్ష్యాలకు సంపూర్ణ సాకారం అందాల్సిన బాధ్యత మనది
- భాజపా అభివృద్ధిని గుర్తించి 2019లో మాకు సంపూర్ణ అధికారం ఈ దేశం ఇచ్చింది
17:26 August 10
- విపక్షాలు అవిశ్వాసం పెట్టి అబాసుపాలయ్యాయి: ప్రధాని
- క్రికెట్ భాషలో చెప్పాలంటే వరుస నోబాల్స్ వేస్తున్నారు: ప్రధాని
- అధికారపక్షం ఫోర్లు, సిక్సులు కొడుతోంది: ప్రధాని
- విపక్షాలు మాట్లాడిన ప్రతి మాట దేశమంతా శ్రద్ధగా వింటోంది: ప్రధాని
- ఇప్పటివరకు దేశాన్ని మీరు నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప చేసిందేమీ లేదు
- విపక్షాలు.. వాళ్లు తీసుకున్న గోతిలో వారే పడుతున్నారు
- 1999లో శరద్ పవార్ నాయకత్వంలో అవిశ్వాసం పెట్టారు
- 2003లో సోనియా నేతృత్వంలో అవిశ్వాసం పెట్టారు
- 2018లో మళ్లీ అవిశ్వాస తీర్మానం పెట్టారు
- ఇన్ని అవిశ్వాసాలతో ఏం సాధించారు
- అవిశ్వాసాలు ఎందుకు పెడుతున్నారు.. అసలు మీ సమస్య ఏంటి
- అధిర్ రంజన్ అవిశ్వాసం ప్రవేశపెడతామన్నారు.. ఎందుకు పెట్టలేదు
- కోల్‌కతా నుంచి ఫోన్ వస్తే అధిర్ రంజన్ అవిశ్వాసం పక్కనపెట్టారా?
- అధిర్ రంజన్ పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా
17:20 August 10
- విపక్షాలు అవిశ్వాసం పెట్టి అభాసుపాలయ్యాయి: ప్రధాని
- విపక్ష నేతలు... వాళ్లు తీసుకున్న గోతిలో వారే పడుతున్నారు: ప్రధాని మోదీ
- క్రికెట్ భాషలో చెప్పాలంటే విపక్షాలు వరుస నోబాల్స్ వేస్తున్నాయి: ప్రధాని
- విపక్షం నోబాల్స్ వేస్తుంటే అధికారపక్షం ఫోర్లు, సిక్సులు కొడుతోంది: ప్రధాని

17:18 August 10
- 2018లోనూ మా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారు: ప్రధాని
- మా ప్రభుత్వంపై ప్రజలు అనేకసార్లు విశ్వాసం చూపించారు: ప్రధాని
- వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ సర్కారే వస్తుంది: ప్రధాని
- అన్ని రికార్డులు బద్దలు కొట్టి ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది: ప్రధాని
- ఇటీవల మా ప్రభుత్వం కీలక బిల్లులు సభలో ఆమోదించింది: ప్రధాని
- కీలక బిల్లులపై విపక్షాలకు ఏమాత్రం ఆసక్తి లేదు: ప్రధాని
- దేశ ప్రజల పట్ల విపక్షాలు విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టాయి: ప్రధాని
- పేదల గురించి ఆలోచన లేదు.. అధికారంలోకి రావడమే వారి పరమావధి: ప్రధాని
17:12 August 10
- లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం
- గతంలోనూ నా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారు: ప్రధాని మోదీ

17:10 August 10
లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. అంతకుముందు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సభకు చేరుకున్నారు.
15:38 August 10
పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్ అప్డేట్స్
PM Modi Today Speech In Parliament : లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ.. మరికాసేపట్లో ప్రసంగించనున్నారు. విపక్షాల 'ఇండియా' కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మోదీ సమాధానమివ్వనున్నారు. అవిశ్వాస తీర్మానంపై గత మూడు రోజులగా లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. అయితే మణిపుర్ హింసపై చర్చించేందుకే అవిశ్వాసం ప్రవేశపెట్టినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. దీంతో ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.