ETV Bharat / bharat

ఈనెల 9న మోదీ అధ్యక్షతన భద్రతా మండలిలో చర్చ - ఐక్యరాజ్యసమితి భద్రత మండలి

ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో సముద్ర భద్రతపై వర్చువల్​గా జరగునున్న బహిరంగ చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్​ బాగ్చి ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : Aug 3, 2021, 8:09 AM IST

ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో(యూఎన్​ఎస్​సీ) సముద్ర భద్రతపై ఆగస్టు 9న జరగనున్న బహిరంగ చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు. యూన్​ఎస్​సీలో వర్చువల్​గా జరగనున్న చర్చకు తొలిసారిగా భారత ప్రధాని అధ్యక్షత వహించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్​ బాగ్చి ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

"ఐరాస భద్రత మండలిలో ఆగస్టు 9న 'అంతర్జాతీయ భద్రత, శాంతి నిర్వహణ: సముద్ర భద్రత' అనే అంశంపై బహిరంగ చర్చ జరగనుంది. వర్చువల్​గా జరగనున్న ఈ చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. బహిరంగ చర్చకు భారత ప్రధాని అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి కానుంది."

- అరిందమ్​ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి

భద్రతా మండలిలో రెండేళ్ల పాటు (2021-2022) తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతోన్న భారత్‌, అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఆగస్టు నెలతో పాటు తాత్కాలిక సభ్య దేశంగా గడువు ముగిసే (డిసెంబర్‌ 2022) చివరి నెలలోనూ మరోసారి అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టనుంది.

ఇదీ చూడండి: ఐరాస భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.