Mann Ki Baat: ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతిని, జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలిపిన క్షణం అమరుల కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ సమయంలో వారి కళ్లు చెమర్చాయని వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలో మన్‌కీ బాత్ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి.
ఈ జ్యోతి విలీనం చేయడాన్ని హర్షిస్తూ ఎందరో మాజీ సైనికులు తనకు లేఖ రాశారన్నారు మోదీ. జాతీయ యుద్ధ స్మారకంలో అమర జవాన్ జ్యోతిని విలీనం చేసి అమరులకు ఘన నివాళి ఇచ్చినట్లు అయిందని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.
వారి మన్‌కీ బాత్‌ను అలా..
పిల్లలు కూడా తమ మనసులో మాటను పోస్టు కార్డు ద్వారా తెలిపారని.. కోటికి పైగా పిల్లలు పోస్టుకార్డులు పంపినట్లు వెల్లడించారు. దేశవిదేశాల నుంచి వచ్చిన ఈ పోస్టుకార్డులు దేశ భవిష్యత్తుపై నవతరానికి ఉన్న దృక్పథాన్ని తెలుపుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అమర జవాన్ జ్యోతి విలీనం జరిగిన యుద్ధ స్మారకాన్ని సందర్శించాలని కోరారు ప్రధాని.
అలా చేస్తే అవినీతి అంతం
అవినీతి చెదపురుగు వంటిదన్నారు మోదీ. దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవినీతి నుంచి భారత్‌కు వీలైనంత త్వరగా విముక్తి కలిగించాలని అన్నారు. మన విధులకు ప్రాధాన్యం ఇస్తే అవినీతి ఉండదని పేర్కొన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి : 'కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుందాం'