ETV Bharat / bharat

'భారత్ నుంచి 75 దేశాలకు రక్షణ పరికరాలు​'.. ఏరో ఇండియా ప్రదర్శనలో మోదీ - aero india 2023 banglaore

ఏరో ఇండియా ప్రదర్శన భారత్​ సామర్థ్యాలను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. విదేశాలకు రక్షణ రంగ సామగ్రి ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిందని ఆయన అన్నారు. బెంగళూరు శివారు యలహంకలో ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రారంభించిన మోదీ.. వైమానిక దళం ప్రదర్శించిన విన్యాసాలను ఆయన ఆసక్తిగా తిలకించారు.

modi
modi
author img

By

Published : Feb 13, 2023, 11:03 AM IST

Updated : Feb 13, 2023, 11:09 AM IST

విదేశాలకు రక్షణ రంగ సామగ్రి ఎగుమతి చేసే దేశంగా భారత్​ మారిందని ప్రధాని మోదీ తెలిపారు. రక్షణ రంగంలో ఇండియా బలోపేతమైందని చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరు శివారు యలహంకలో ఏరో ఇండియా-2023 ప్రదర్శనను మోదీ.. సోమవారం ప్రారంభించారు. అనంతరం భారత వైమానిక దళం ప్రదర్శించిన విన్యాసాలను ఆయన ఆసక్తిగా తిలకించారు.

"ఏరో ఇండియా ప్రదర్శన.. భారత్​ కొత్త బలం, సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. ఏరో ఇండియా ఒక ప్రదర్శన మాత్రమే కాదు.. భారత్​ ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం. కేంద్ర బడ్జెట్​లో రక్షణ రంగ వస్తువుల తయారీ పరిశ్రమలకు పెద్ద పీట వేశాం. పరిశ్రమలకు ఇచ్చే అనుమలు సరళతరం చేశాం. రక్షణ రంగంలో భారత్​ బలోపేతమైంది. తక్కువ ఖర్చుతోనే రక్షణ పరికరాలు తయారు చేసుకుంటున్నాం. దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణపరికరాల దిగుమతిదారుగా ఉన్న భారత్.. ఇప్పుడు ప్రపంచంలోని 75దేశాలకు రక్షణరంగ పరికరాలను ఎగుమతి చేస్తోంది. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేట్​ సంస్థలను కోరుతున్నాను. ఈ రోజు దాదాపు 100 దేశాలు మన ప్రదర్శనలో పాల్గొంటున్నాయంటే.. భారత్‌పై ఈ ప్రపంచం ఎంత విశ్వాసంగా ఉందో స్పష్టమవుతోంది."
-నరేంద్ర మోదీ, ప్రధాని

'ద రన్‌ వే టు ఏ బిలియన్‌ ఆపర్చునిటీస్‌' పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ప్రారంభించేందుకు ప్రధాని ఆదివారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నారు. ఏరో ఇండియా షో ఆసియాలో అతి పెద్ద వైమానిక ప్రదర్శనగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. 'భారత్‌లో తయారీ- ప్రపంచ కోసం తయారీ' అనే లక్ష్యాలతో రూపొందించిన భారతీయ రక్షణ రంగ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయన్నారు. 32 దేశాల రక్షణ మంత్రులు, 73 మంది వివిధ సంస్థల సీఈఓలు పాల్గొంటారని తెలిపారు. 17వరకు నిర్వహించే కార్యక్రమంలో రూ.75 వేల కోట్ల ఒప్పందాలు చేసుకోవడానికి వీలుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.

ప్రత్యేకతలివే!

  • యలహంక వైమానిక కేంద్రంలో 35 వేల చదరపు కిలోమీటర్లలో ప్రదర్శన వేదిక ఏర్పాటు.
  • తొలిసారిగా ఐదు రోజుల పాటు వైమానిక ప్రదర్శన నిర్వహిస్తారు.
  • రికార్డు ప్రకారం.. అత్యధిక సంఖ్యలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి.
  • 32 దేశాల రక్షణ మంత్రులు, 29 దేశాల వైమానిక చీఫ్‌లు, 73 సంస్థల సీఈఓలతో సమావేశాలు నిర్వహిస్తారు.
  • 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు పాల్గొనటం ఇదే తొలిసారి. వీటిల్లో ఎంఎస్‌ఎంఈ, అంకురాలున్నాయి.
  • భారతీయ రక్షణ, వైమానిక రంగ సంస్థల ఆత్మనిర్భర్‌ ఉత్పత్తులతో ఇండియన్‌ పెవిలియన్‌, రక్ష మంత్రి, రక్ష రాజ్య మంత్రి, చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, కార్యదర్శులతో ద్వైపాక్షిక సమావేశాలు, నివృత్త సైనికులతో సమావేశాలు, కర్ణాటక పెవిలియన్‌లు ఈ ప్రదర్శనలో నిర్వహిస్తారు.

స్వదేశీ ఉత్పత్తులకు పెద్ద పీట
గత ఐదేళ్లుగా భారతీయ రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తుల్లో 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే. ఆత్మనిర్భర్‌ నిధులతో రక్షణ రంగం సాధించిన ప్రగతి వేదిక ద్వారా ప్రపంచ స్థాయి రక్షణ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆత్మనిర్భర్‌ ఉత్పత్తులు ప్రపంచ అతి పెద్ద ఆర్థికత ఉన్న మూడు దేశాల్లో చోటు సాధించేందుకు ఉపయోగపడతాయి. ఈ ఉత్పత్తులను ఆత్మనిర్భర్‌ వేదిక ద్వారా వీక్షించే వీలుంది. ఇండియన్‌ పెవిలియన్‌ ద్వారా 115 సంస్థల 227 ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. అందులో ఎల్‌ఆర్‌యూ, ఎల్‌సీఏ-తేజాస్‌, ఎఫ్‌సీఎస్‌, డిజిటల్‌ ఫ్లై బై, మల్టీ రోల్‌ సూపర్‌ సానిక్‌ ఫైటర్‌, ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో తయారైన ఉత్పత్తులు ప్రదర్శిస్తారు.

Last Updated : Feb 13, 2023, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.