ETV Bharat / bharat

TDP JSP Coordination Committee Meeting Highlights: వైసీపీని ఇంటికి పంపాల్సిందే.. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీలో కీలక నిర్ణయాలు - Pawan Kalyan Nara Lokesh Press Meet

Pawan Kalyan Nara Lokesh Press Meet in Rajahmundry: 2024లో వచ్చేది తెలుగుదేశం-జనసేన ప్రభుత్వమని.. విజయ దశమి పర్వదినాన ప్రజలకు మేలు చేసేలా సమావేశం నిర్వహించినట్టు రాజమహేంద్రవరంలో నిర్వహించిన తొలి సమన్వయ కమిటీ సమావేశంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​, జనసేనాని పవన్ కల్యాణ్​లు చెప్పారు. ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాలే అజెండాగా చారిత్రక నగరి రాజమహేంద్రవరంలో సమావేశం నిర్వహించిన్టట్టు తెలిపారు. నవంబర్ 1 నుండి ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. వైకాపా అరాచకానికి తెలుగుదేశం-జనసేన ప్రభుత్వమే విరుగుడని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయబోమని.. తెదేపా అధినేత చంద్రబాబుకు నైతిక మద్దతు, ప్రజలకు భరోసా కోసమే ఐకాసా సమావేశం నిర్వహించినట్టు ప్రకటించారు.

Pawan Kalyan Nara Lokesh Press Meet in Rajahmundry

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 8:09 PM IST

Updated : Oct 24, 2023, 6:52 AM IST

TDP JSP Coordination committee meeting highlights మూడు విడుతలుగా కార్యాచరణ..

Pawan Kalyan Nara Lokesh Press Meet in Rajahmundry: చారిత్రక నగరి రాజమహేంద్రవరంలో తెలుగుదేశం-జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం పవన్ కల్యాణ్, లోకేశ్​ ఆధ్వర్యంలో నిర్వహించారు. హోటల్ మంజీరాలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత సమావేశం ప్రారంభమై.. సుమారు మూడు గంటల సేపు సుదీర్ఘంగా కొనసాగింది. లోకేశ్​, పవన్​లతోపాటు తెదేపా నుంచి సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య సమావేశానికి హాజరయ్యారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, వి.మహేంద్ రెడ్డి, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, యశస్విని పాల్గొన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, తెదేపా-జనసేన ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీ శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ అనంతరం పవన్ కల్యాణ్, లోకేశ్​ మీడియాతో మాట్లాడారు. వైకాపా ఓటు చీలనివ్వబోవని గతంలో హామీ ఇచ్చామని.. ఆ మాటకు కట్టుబడి తెదేపా అధినేత చంద్రబాబుపై అక్రమ కేసుపై జైలులో పెట్టిన ఆయన్ను పరామర్శకు వచ్చినప్పుడు రెండు పార్టీల పొత్తు నిర్ణయం ప్రకటించినట్టు పవన్ చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలపై దాడులు, కేసులు నిత్య కృత్యంగా మారాయని పవన్ అన్నారు. జగన్​పై తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదన్న పవన్.. వైకాపా ప్రభుత్వ విధానాలు, అరాచకాలు, అకృత్యాలు దాడులు, అక్రమ కేసులు వంటి అంశాలకు తాను వ్యతిరేకమన్నారు. దీనికి జనసేన- తెదేపా కలయికే సరైన వ్యాక్సిన్ అని పవన్ చెప్పారు

TDP Janasena Joint Action Committee Meeting పరిచయం చేసుకుంటూ.. ఉద్యమ ప్రణాళికలు రచిస్తూ.. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ చిత్రాలు

రాజమహేంద్రవరంలో బహిరంగ సభ: చంద్రబాబుని కావాలనే వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని.. చిత్రహింసలకు గురి చేస్తోందని ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటోందని అన్నారు. ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలని, ఉమ్మడి కార్యాచరణతో ఎలా ముందుకు సాగాలన్న అంశాలపై చర్చించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో భరోసా నింపేలా చర్చ సాగిందని పవన్ అన్నారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజమహేంద్రవరం సాక్షిగా బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.

మూడు విడతలుగా కార్యక్రమాలు: ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించామన్న పవన్.. టీడీపీ-జనసేన ఎలా కలిసి పనిచేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై రెండుపార్టీల నేతలు లోతుగా చర్చించారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వాలనే దానిపై చర్చించామని.. త్వరలోనే కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామని పేర్కొన్నారు.

TDP Janasena Alliance First Meeting: టీడీపీ-జనసేన 'కీ'లక భేటీ.. విజయమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణ..!

3 విడతలుగా తమ కార్యక్రమాలు ఉంటాయన్న పవన్.. ఉమ్మడిగా ఎలా వెళ్లాలనే దానిపై రెండో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రజలకు తొలుత భద్రత, సంక్షేమం, అభివృద్ధి కావాలని.. ప్రజలకు మేలు చేసే అంశాలపైనే చర్చించామని తెలిపారు. రెండు పార్టీల మధ్య ఉన్న క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించుకుంటామన్న పవన్.. ఉమ్మడి కార్యాచరణపై వారం, పది రోజుల్లో స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ఏపీలో చాలా చిత్రమైన పరిస్థితి ఉందని.. తమకు రాష్ట్ర ప్రజలే ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

TDP Janasena Co ordination First meeting Highlights ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ.. ఆరు అంశాలతో టీడీపీ-జనసేన అజెండా

కరవు-జగన్ కవల పిల్లలు: విజయదశమి రోజున రాష్ట్రానికి మేలు చేసేలా ఇరు పార్టీలు కలిసి సమావేశం నిర్వహించినట్టు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ చెప్పారు. వైకాపా ప్రభత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు, ప్రశ్నిస్తే కేసులు అధికమయ్యాయని ఉదాహరణలతో వివరించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని.. 34 లక్షల ఎకరాల్లో పంట నష్టం వచ్చే అవకాశం ఉందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసిందని...రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం చేరిందని లోకేశ్​ ఆవేదన వ్యక్తం చేశారు. కరవు-జగన్ కవల పిల్లలని అన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలపై మోయలేని పన్నుల భారం వేసిందని.. అదే సమయంలో యువతకు ఉపాధి కరవైందని అన్నారు.

నవంబరు 1న మ్యానిఫెస్టో: గత నాలుగున్నరేళ్లుగా ప్రజల సమస్యలపై పోరాడుతున్న వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబుని 44 రోజులుగా జైలులో పెట్టారని... వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తున్నారని అన్నారు. తెదేపా జనసేన ఐకాస తొలి సమావేశంలో వంద రోజుల కార్యాచరణపై చర్చించినట్టు చెప్పారు. రాజమహేంద్రవరం చారిత్రక సమావేశంలో మూడు తీర్మానాలు చేసినట్టు లోకేశ్​ వివరించారు. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ తీర్మానం, అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిర్ణయం, అన్ని వర్గాలను అభివృద్ధి బాటలో నడిపించాలని తీర్మానించారు. నవంబరు 1న మ్యానిఫెస్టో ప్రకటించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తామని అన్నారు.

తెదేపా-జనసేన తొలి సమావేశం విజయదశమి రోజు విజయవంతంగా ముగియడంతో ఇరు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు సాగనున్నాయి.

Nara Lokesh Brahmani Mulakat with Chandrababu: చంద్రబాబుతో లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్.. కీలక విషయాలపై చర్చ

Last Updated : Oct 24, 2023, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.