ETV Bharat / bharat

TDP Janasena Co ordination First meeting Highlights ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ.. ఆరు అంశాలతో టీడీపీ-జనసేన అజెండా - రాజమండ్రిలో టీడీపీ జనసేన నేతల సమావేశం

Pawan Kalyan Nara Lokesh Meeting in Rajahmundry: రాజమహేంద్రవరంలో తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం సహృద్భావ వాతావరణంలో జరిగింది. రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌, కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌తోపాటు కమిటీ సభ్యులు భేటీలో పాల్గొన్నారు. మొత్తం ఆరు అంశాలతో టీడీపీ జనసేన అజెండాను ఖరారు చేశారు.

Pawan Kalyan Nara Lokesh Meeting in Rajahmundry

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 6:02 PM IST

Pawan Kalyan Nara Lokesh Meeting in Rajahmundry: టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం (TDP Janasena Alliance First Meeting) రాజమహేంద్రవరంలో జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఇరు పార్టీల నుంచి 14 మంది నేతలు పాల్గొన్నారు.

టీడీపీ తరఫున పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. అదే విధంగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌, వి. మహేందర్ రెడ్డి, కోటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేష్‌, బొమ్మిడి నాయకర్‌, పలవలసాల యశశ్విని హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీల సమన్వయంపై చర్చించినట్లు సమాచారం. వైసీపీ నియంతృత్వ విధానాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

TDP Janasena Joint Action Committee Meeting పరిచయం చేసుకుంటూ.. ఉద్యమ ప్రణాళికలు రచిస్తూ.. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ చిత్రాలు

రాజమండ్రిలో జరిగిన టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో.. తెలుగుదేశం నేతలను పవన్‌కు లోకేశ్ పరిచయం చేశారు. కమిటీలోని జనసేన నేతలను పేరుపేరునా లోకేశ్ పలకరించారు. కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా రూపొందించారు. ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, జాబితాలో అవకతవకలపై సమన్వయ కమిటీ ఏర్పాటు సహా.. రాష్ట్ర స్థాయి నుంచి బూత్, జిల్లా స్థాయిల వరకు సమన్వయంపై ఐకాస కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, అవినీతిపై, ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాట ప్రణాళికపై సమన్వయ కమిటీ చర్చించింది. ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాట ప్రణాళికపై సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27వ తేదీన ఓటర్ తొలి ముసాయిదా ప్రకటనపై చర్చించారు.

TDP Janasena Alliance First Meeting: టీడీపీ-జనసేన 'కీ'లక భేటీ.. విజయమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణ..!

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తీర్మానం: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సమన్వయ కమిటీ తీర్మానం చేసింది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. సమన్వయ కమిటీ తదుపరి భేటీలు ఉత్తరాంధ్ర, రాయలసీమలో జరపాలని నిర్ణయించారు. సమన్వయ కమిటీ భేటీకి ముందు నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు విడిగా సమావేశమయ్యారు.

భేటీకి ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును రాజమహేంద్రవరం జైలులో లోకేశ్‌ కలిసి మాట్లాడారు. ప్రధానంగా జనసేనతో నిర్వహించనున్న సమన్వయ కమిటీ సమావేశం.. అందులో ఏయే అంశాలను చర్చిస్తున్నామనే విషయాలను లోకేశ్.. చంద్రబాబుకు తెలిపారు. కరవు, కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్షతో పాటు వివిధ ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు లోకేశ్‌ పేర్కొన్నారు. నిత్యావసర ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపు వంటి అంశాలపైనా దృష్టి సారించాలని లోకేశ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయి వరకు టీడీపీ-జనసేన కమిటీల ఏర్పాటుపైనా చర్చించారు.

Nara Lokesh Brahmani Mulakat with Chandrababu: చంద్రబాబుతో లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్.. కీలక విషయాలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.