లోక్‌సభ వాయిదా
మణిపుర్ ఘర్షణలపై చర్చించాలని కోరుతూ విపక్షాలు చేస్తున్న నిరసనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి.. లోక్‌సభ వాయిదా
14:48 July 26
14:21 July 26
విపక్షాల వాకౌట్
మణిపుర్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ రాజ్యసభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.
12:33 July 26
కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. అన్ని పార్టీలతో మాట్లాడి చర్చకు సమయం ప్రకటిస్తామని వెల్లడించారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
12:28 July 26
- అవిశ్వాస తీర్మానంతో కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న విపక్షాలు
- లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్, భారాస
- కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించిన లోక్‌సభ స్పీకర్
- అన్ని పార్టీలతో మాట్లాడి చర్చకు సమయం ప్రకటిస్తామన్న స్పీకర్

12:24 July 26
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. "నేను అన్ని పార్టీల నాయకులతో చర్చించి.. చర్చకు తగిన సమయాన్ని మీకు తెలియజేస్తాను" అని స్పీకర్ చెప్పారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు సభను వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు.
12:12 July 26
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్.. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆ తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు.
12:03 July 26
కాసేపు వాయిదా అనంతరం ఉభయసభలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
11:47 July 26
మణిపుర్‌పై చర్చకు డిమాండ్ చేస్తున్న విపక్ష ఎంపీల నినాదాల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.
11:21 July 26
విపక్ష ఎంపీల నినాదాల మధ్య లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ప్రధాని సభకు వచ్చి మణిపుర్ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అటు రాజ్యసభలోనూ విపక్షాలు మణిపుర్ అంశాన్ని లేవనెత్తగా.. వారి ఆందోళనల నడుమే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అంతకుముందు కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఉభయ సభలు నివాళులర్పించాయి.
11:20 July 26
- లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
- మణిపుర్ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు
- విపక్ష ఎంపీల నినాదాల మధ్య లోక్‌సభ వాయిదా
11:06 July 26
- లోక్‌సభలో విపక్ష సభ్యుల నినాదాలు
- మణిపుర్ అంశంపై చర్చించాలని విపక్షాల పట్టు
- విపక్ష సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
- ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేస్తున్న విపక్ష సభ్యులు
10:56 July 26
- దిల్లీ పాలనాధికారాల బిల్లుపై విప్ జారీచేసిన కాంగ్రెస్, భారాస
- లోక్‌సభ ఎంపీలంతా సభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ
- దిల్లీ పాలనాధికారాల బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని విప్ జారీ
10:46 July 26
బీజేపీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం
Opposition No Confidence Motion : మణిపుర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి 'ఇండియా'.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైంది. లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్ కార్యాలయానికి నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. ప్రధాన మోదీని మాట్లాడించి.. తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి యోచిస్తోంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్ కార్యాలయానికి కాంగ్రెస్ నోటీసులిచ్చింది.