ETV Bharat / bharat

జాతరలో బోర్ కొట్టి చెరువు గట్టున వాకింగ్.. వజ్రం దొరికి రాత్రికి రాత్రే లక్షాధికారిగా... - పన్నా గనుల్లో దొరికిన డైమండ్స్​

విలువైన వజ్రాలు దొరకడం వల్ల ఇద్దరు వ్యక్తులు రాత్రికి రాత్రే లక్షాధికారులయ్యారు. మధ్యప్రదేశ్​ పన్నాలో జరిగిందీ ఘటన.

panna diamond diggers
panna diamonds
author img

By

Published : Oct 13, 2022, 10:57 AM IST

ఇద్దరు సామాన్యులు.. రాత్రికి రాత్రే లక్షాధికారులయ్యారు. మధ్యప్రదేశ్​లోని పన్నాలో వజ్రాల నిక్షేపాలు అపారంగా ఉండడమే ఇందుకు కారణం. ఇటీవలే అదే ప్రాంతంలో రూ.40 లక్షలు విలువైన వజ్రం దొరికి నొయిడాకు చెందిన రాణా ప్రతాప్​ జీవితం రాత్రికి రాత్రే మారిపోగా.. ఆ కోవలోకి మరో ఇద్దరు చేరారు.

వివరాల్లోకి వెళ్తే.. పన్నాలో జరిగే శరద్​పూర్ణిమ మేళాకు వృందావన్​ రైక్​వార్ అనే వ్యక్తి వచ్చాడు. మేళా అంతా తిరిగాక అతను కమలాబాయి చెరువు వద్ద తిరుగుతుండగా ఆ ప్రాంతంలో అతనికి ఓ అరుదైన వజ్రం దొరికింది. 4.86 క్యారెట్ జెమ్స్​ క్వాలిటీ​ గల ఈ వజ్రం విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా. దీన్ని అతను పన్నాలోని డైమండ్ ఆఫీస్​లో డిపాజిట్ చేశాడు.

పన్నా వజ్రాన్ని సొంతం చేసుకున్న మరో అదృష్టవంతుడు దస్సూ కోందర్​కు చెందిన గాడా ఛతర్​పుర్. ఇతను గత కొంత కాలంగా వజ్రాల వేటలో నిమగ్నమయ్యుండగా బుధవారం అతని పంట పండింది. ఓ అరుదైన వజ్రం అతని సొంతమయ్యింది. 3.40 క్యారెట్లు గల ఈ వజ్రాన్ని అతను పన్నాలోని డైమండ్ ఆఫీస్​లో డిపాజిట్ చేశాడు. ఈ రెండు వజ్రాలను త్వరలో జరిగే వేలంలో ఉంచనున్నట్లు డైమండ్​ ఆఫీస్​ అధికారులు తెలిపారు.

మధ్యప్రదేశ్​లోని పన్నా వజ్రాల గనులకు ప్రసిద్ధి. అనేక మంది ఆ ప్రాంతంలో భూమిని లీజుకు తీసుకుని, ప్రభుత్వ అనుమతితో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతుంటారు. గనుల్లో దొరికిన వజ్రాల్ని డైమండ్ ఆఫీస్​లో డిపాజిట్ చేసి, అధికారుల సమక్షంలో వేలం వేయిస్తారు. అయితే.. ఆ ప్రాంతంలో ఎవరికైనా తమ పొలాల్లో ఏదైనా విలువైన వజ్రం లేదా రాయి దొరికితే ప్రభుత్వం వాటి విలువలో 12.5 శాతం వాటా ఇస్తుంది. కానీ కొంత మంది తమకు గనుల్లో దొరికిందని, ఆ వస్తువు తమదే అని వాదిస్తారు. ఒక వేళ ఈ విషయం కోర్టుకు వెళ్తే తీర్పు గని యజమానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఒక వేళ డైమండ్​ దొరికిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయకుండా దాచితే వారిపై చర్యలు​ తీసుకోవచ్చని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: 'మరో హిందీ వ్యతిరేక ఉద్యమం రానీయకండి'.. ఆ సిఫార్సులపై సౌత్ నేతలు ఫైర్

తాజ్​మహల్ వద్ద అందాల ప్రదర్శన.. 35 దేశాల సుందరీమణుల సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.