ETV Bharat / bharat

'మణిపుర్​లో భరతమాత హత్య.. అందుకే ఆ రాష్ట్ర పర్యటనకు మోదీ దూరం' - పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Rahul Gandhi Parliament Speech Today : మణిపుర్​లో భరతమాతను హత్య చేశారని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత సైన్యం తలుచుకుంచే ఒక్క రోజులోనే మణిపుర్​లో శాంతి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రధాని మోదీ.. అమిత్ షా, అదానీ మాటలే వింటున్నారని విమర్శించారు. తాను సత్యం కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని రాహుల్ గాంధీ అన్నారు.

rahul gandhi parliament speech
rahul gandhi parliament speech
author img

By

Published : Aug 9, 2023, 1:08 PM IST

Updated : Aug 9, 2023, 1:46 PM IST

Rahul Gandhi Parliament Speech Today : మణిపుర్‌లో భరతమాతను హత్య చేశారని బీజేపీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ. మణిపుర్‌ ప్రజలను హత్య చేయడం ద్వారా దేశాన్ని చంపేశారని విమర్శించారు. భారత సైన్యం తలుచుకుంచే ఒక్క రోజులోనే మణిపుర్​లో శాంతి సాధ్యమవుతుందని అన్నారు. 'మీరు దేశభక్తులు కాదు.. దేశ ద్రోహులు. మీరు దేశాన్ని రక్షించే వారు కాదు.. దేశ హంతకులు. మణిపుర్‌లో మీరు తల్లులను హత్య చేశారు. మోదీ మణిపుర్‌ మాట వినేందుకు ఇష్టపడట్లేదు. రావణుడు కేవలం మేఘనాథ్‌, కుంభకర్ణుడి మాటలే వినేవాడు. మోదీ కూడా అమిత్‌ షా, అదానీ మాటలే వింటున్నారు.' అని రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్​సభలో బుధవారం అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

'భయపడొద్దు.. ఈ రోజు అదానీ గురించి మాట్లాడను'
Rahul Gandhi On Manipur : బీజేపీకి రాజనీతి లేదని.. హిందుస్థాన్​ను హత్య చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తన ప్రసంగం గురించి బీజేపీ భయపడాల్సిన అవసరం లేదని.. తాను అదానీ అంశంపై ఈ రోజు మాట్లాడనని వ్యంగ్యంగా అన్నారు. 'కొన్నిరోజుల క్రితం నేను మణిపుర్‌ వెళ్లాను. ప్రధాని మోదీ ఇప్పటి వరకు మణిపుర్‌ వెళ్లలేదు. ప్రధాని దృష్టిలో మణిపుర్‌ దేశంలో భాగం కాదు. ఆ రాష్ట్రంలోని పునరావాస శిబిరాల్లోని మహిళలు, పిల్లలతో నేను మాట్లాడాను. బాధితులకు మద్దతుగా నేను రాత్రంతా వారితో గడిపాను. మోదీ మణిపుర్‌ను రెండు వర్గాలుగా విడగొట్టారు' అని రాహుల్ విమర్శించారు.

  • #WATCH | Congress MP Rahul Gandhi says, "They killed India in Manipur. Not just Manipur but they killed India. Their politics has not killed Manipur, but it has killed India in Manipur. They have murdered India in Manipur." pic.twitter.com/u0ROyHpNRL

    — ANI (@ANI) August 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'సత్యం కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం'
Rahul Gandhi Speech In Lok Sabha Today : తాను నమ్మిన సత్యం కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర సమయంలో ప్రజాసమస్యలు తనను కదిలించాయని తెలిపారు. బీజేపీ ప్రతిచోట కిరోసిన్​ను జల్లుతోందని విమర్శించారు. మణిపుర్​లో కిరోసిన్ పోసి నిప్పంటించారని.. ప్రస్తుతం హరియాణాలో అదే పని చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు.. తన లోక్​సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు.

  • #WATCH | Congress MP Rahul Gandhi speaks on his Bharat Jodo Yatra; says, "...Initially, when I started (the Yatra), I had in my mind that walking 25 km is no big deal if I can run 10 km every day. Today, when I look at that - it was arrogance. I had arrogance in my heart at that… pic.twitter.com/QhFjtkZhLb

"కొన్నాళ్ల క్రితం నేను దేశం ఒక మూల నుంచి మరో మూలకు భారత్ జోడో యాత్ర చేశాను. ఆ యాత్ర ఎందుకు చేస్తున్నావని నన్ను చాలా మంది అడిగారు. దేశాన్ని అర్థం చేసుకునేందుకు, ప్రజలకు కలిసేందుకే ఆ పాదయాత్ర. భారత్ జోడో యాత్ర పారంభించిన మొదట్లో నాకు అహంకారం ఉండేది.. అలా యాత్ర కొనసాగుతున్న కొద్దీ నాలో అహంకారం క్రమంగా మాయమైంది. సామాన్యులను, ధనవంతులను, వ్యాపారులను.. ఇలా అన్ని వర్గాలను జోడో యాత్ర చేస్తున్నప్పుడు కలిశాను."

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

'ప్రధాని మౌనవ్రతం ముగించేందుకే అవిశ్వాసం.. వీడియోలు రాకుంటే మోదీ నోరు విప్పేవారు కాదు'

Opposition No Confidence Motion 2023 : 'మణిపుర్‌లో భారత మాతను హత్య చేశారు'.. అవిశ్వాసంపై చర్చలో రాహుల్​

Last Updated : Aug 9, 2023, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.