ETV Bharat / bharat

86ఏళ్ల వయసులో 10వ తరగతి పాసైన మాజీ సీఎం.. - పదో తరగతి పాస్​

లేటు వయసులో 10వ తరగతిలో(10th class result) ఉత్తీర్ణత సాధించారు ఓ మాజీ సీఎం. రాష్ట్ర పదో తరగతి బోర్డు చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. హాజరైన ఆంగ్లం పేపర్​లో 88 మార్కులతో డిస్టింక్షన్​ సాధించారు.

OP Chautala
10వ తరగతి పాసైన మాజీ సీఎం..
author img

By

Published : Sep 4, 2021, 9:29 PM IST

హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్​ చౌతాలా 86 ఏళ్ల వయసులో 10వ తరగతి(10th class result) పాసయ్యారు. ఆగస్టు 18వ తేదీన పదో తరగతి ఆంగ్లం పరీక్ష రాయగా.. తాజాగా ఫలితాలు వెలువడ్డాయి. ఇంగ్లీష్​ పేపర్​లో చౌతాలా 88 మార్కులు సాధించారు. రాష్ట్ర పదో తరగతి బోర్డు చరిత్రలో.. ఉత్తీర్ణత సాధించిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచారు చౌతాలా.

Om Prakash Chautala
ఓం ప్రకాశ్​ చౌతాలా

దిల్లీలోని తిహాడ్​ జైలులో ఉన్న సమయంలో ముందుగా 10వ తరగతి, ఆ తర్వాత 12వ తరగతి పరీక్షలు రాశారు చౌతాలా. పదో తరగతి ఆంగ్లం పేపర్​ ఫలితాలు రాకపోవడం వల్ల 12వ తరగతి ఫలితాలను పెండింగ్​లో పెట్టారు.

చౌతాలా వయసు, చేతికి గాయమైన కారణంగా.. ఇంగ్లీష్​ పేపర్​ రాసేందుకు తొమ్మిదో తరగతి విద్యార్థి మల్కిత్​ సాయం చేశాడు.

ఇదీ చూడండి: 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.