వీధి కుక్కల దాడిలో ఓ ఏడాది చిన్నారి మంగళవారం మృతిచెందాడు. చనిపోయిన పసికందును ఉత్తర ప్రదేశ్ నొయిడాలో లోటస్ బౌలేవార్డ్ సొసైటీలో పని చేసే కార్మికుడి కొడుకుగా పోలీసులు గుర్తించారు.
నొయిడా లోటస్ బౌలేవార్డ్ సొసైటీ ఆవరణలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో చిన్నారి తల్లిదండ్రులు పని చేస్తున్నారు. ఆ సమయంలో చిన్నారి తన సోదరుడితో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా మూడు కుక్కలు బాలుడిపై దాడి చేయగా అతని సోదరుడు కేకలు పెట్టాడు. దీంతో పనిలో ఉన్న బిడ్డ తల్లిదండ్రులతో పాటు మరి కొందరు హుటాహుటిన అక్కడికి చేరుకుని పిల్లాడ్ని రక్షించారు.
ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. చిన్నారి కడుపుపై 25 చోట్ల కుక్కలు కరిచాయని వైద్యులు తెలిపారు. ఈ కేసును అసహజ మరణంగా నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మున్సిపల్ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వృద్ధురాలి మృతదేహాన్ని పీక్కుని తిన్న వీధికుక్కలు..
కర్ణాటకలోని గాణగాపురం ద్యావమ్మన గుడి ఆవరణలో ఓ ఘోర ఘటన జరిగింది. ఓ వృద్ధురాలి మృతదేహాన్ని వీధి కుక్కల సమూహం పీక్కుని తింటూ కనిపించాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
అదే వీధిలో గత కొంతకాలంగా నివాసం ఉన్న ఓ వృద్ధురాలు మృతి చెందగా ఆమెకు దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వీధిలో అనాథగా పడి ఉన్న ఆ మృతదేహాన్ని చూసిన వీధికుక్కలు ఆమె శరీరంలోని చాలా భాగాలను పీక్కుని తిన్నాయి.
ఇదీ చదవండి: ఫోన్ కొట్టేశాడన్న అనుమానంతో బాలుడ్ని నూతిలో వేలాడదీసి విచారణ
జయలలిత మృతి కేసులో ట్విస్ట్.. శశికళపై డౌట్స్.. చనిపోయాక 31 గంటల తర్వాత..