ETV Bharat / bharat

'అలాంటి వ్యక్తిని ఆపే అధికారం ఏ ఎయిర్​లైన్స్​కూ లేదు'

author img

By

Published : Jun 4, 2022, 4:56 AM IST

గత నెలలో ఓ దివ్యాంగ బాలుడిని విమానంలోకి రానివ్వని ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా స్పందించింది. వైకల్యం ఉన్న వ్యక్తి ప్రయాణించకుండా ఆపే అధికారం ఏ ఎయిర్‌లైన్స్‌కూ లేదని స్పష్టం చేసింది.

'అలాంటి వ్యక్తిని ఆపే అధికారం ఏ ఎయిర్​లైన్స్​కూ లేదు'
'అలాంటి వ్యక్తిని ఆపే అధికారం ఏ ఎయిర్​లైన్స్​కూ లేదు'

వైకల్యం ఉన్న వ్యక్తి ప్రయాణించకుండా ఆపే అధికారం ఏ విమానయాన సంస్థకూ లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పష్టం చేసింది. ప్రత్యేక అవసరాలు కలిగిన ఓ చిన్నారిని ఇటీవల విమానంలోకి రానివ్వని ఘటనలో ఇండిగో విమానయాన సంస్థపై రూ.5 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ.. ఈ ఘటనపై తాజాగా స్పందించింది. ‘వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఓ వ్యక్తి ప్రయాణాన్ని ఏ ఎయిర్‌లైన్స్ కూడా తిరస్కరించకూడదు. విమానంలో అలాంటి ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించవచ్చని ఎయిర్‌లైన్స్‌ అనుమానిస్తే.. సదరు ప్రయాణికుడికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అతడు విమానంలో ప్రయాణించవచ్చా.. లేదా? అనే విషయాన్ని వైద్యులు ధ్రువీకరిస్తారు. దాని ద్వారానే ఎయిర్‌లైన్స్‌ నిర్ణయం తీసుకోవాలి’ అని డీజీసీఏ స్పష్టం చేసింది.

ఇదీ జరిగింది..

మే 7న హైదరాబాద్‌ వెళ్లేందుకు దివ్యాంగ బాలుడితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే, అతను విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దానివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ఈ వ్యవహారం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో.. సంస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. స్వయంగా దర్యాప్తు చేపడతానని ప్రకటించారు. మరోవైపు డీజీసీఏ కమిటీ కూడా దర్యాప్తు చేపట్టింది.

రూ.5 లక్షల జరిమానా

సంబంధిత ప్రయాణికులతో విమాన సిబ్బంది అనుచితంగా వ్యవహరించినట్లు డీజీసీఏ తేల్చింది. అనంతరం ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ.. ఇండిగోకు రూ.5 లక్షల జరిమానా విధించింది. ‘‘బాలుడి విషయంలో సిబ్బంది మరింత దయాగుణంతో వ్యవహరిస్తే పరిస్థితి చక్కబడేది. తద్వారా బోర్డింగ్ నిరాకరణ పరిస్థితి వచ్చేది కాదు. ప్రత్యేక సందర్భాల్లో సిబ్బంది మరింత గొప్పగా స్పందించాలి. కానీ, ఈ విషయంలో వారు విఫలమయ్యారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించారు’ అని పేర్కొంది.

ఇదీ చూడండి..

దివ్యాంగ చిన్నారికి విమానంలో నో ఎంట్రీ.. కేంద్రమంత్రి ఫైర్.. దిగొచ్చిన ఇండిగో!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.