omicron variant: కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'(Omicron Variant).. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో.. ఒమిక్రాన్ మొదట వెలుగుచూసిన దక్షిణాఫ్రికా బోట్స్వానా నుంచి భారత్‌కు వచ్చిన మహిళను పట్టుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 18న ఆమె మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.
"బోట్స్వానా దౌత్యకార్యాలయం నుంచి ఓ అధికారి మాకు ఫోన్ చేశారు. బోట్స్వానా నుంచి వచ్చిన మహిళ.. జబల్‌పుర్‌లోని మిలిటరీ ఆర్గనైజేషన్‌లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. సదరు మహిళ ఫోన్ నంబర్, స్థానికంగా ఉన్న అడ్రస్‌ను షేర్ చేయమని చెప్పాం." అని జబల్పుర్ వైద్యాధికారి డాక్టర్. రత్నేష్ కురారియా తెలిపారు.
ఆమె పేరు కునో ఓరెమీట్ సెలిన్ అని.. ఆమె ఎక్కడుందో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని కురారియా అన్నారు. రికార్డ్స్ ప్రకారం.. సెలిన్ దిల్లీనుంచి జబల్‌పుర్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు. జబల్పుర్ సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు. జబల్‌పుర్‌లోని అన్ని హోటల్స్, సరిహద్దు జిల్లాల నుంచి సమాచారం సేకరించామన్నారు.
దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్తగా వెలుగుచూసిన బీ.1.1.529 వేరియంట్‌ను ఇప్పటికే ఆందోళనకర రకంగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. దీనికి 'ఒమిక్రాన్' అని నామకరణం చేసింది.
ఇదీ చూడండి: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా- 'ఒమిక్రాన్' అని అనుమానం!