ETV Bharat / bharat

ఒకే స్కూల్లో 19 మంది విద్యార్థులకు కరోనా- అక్కడ ఒమిక్రాన్​ కలవరం - ఒమిక్రాన్​ అప్డేట్​

Omicron cases in India: దేశంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్​ విస్తరించింది. కొత్తగా రాజస్థాన్​లో 21, దిల్లీలో 12, కేరళలో 8 ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి. మరోవైపు.. తమిళనాడులో ఒమిక్రాన్​ ఒక్కసారిగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మహారాష్ట్ర అహ్మద్​నగర్​లోని ఓ స్కూల్లో 19 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు.

omicron cases in india
ఒమిక్రాన్​ కేసులు
author img

By

Published : Dec 25, 2021, 5:28 PM IST

Updated : Dec 25, 2021, 5:38 PM IST

Omicron cases in India: దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా విస్తరిస్తోంది. రాజస్థాన్​లో కొత్తగా 21 ఒమిక్రాన్​ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్​ కేసుల సంఖ్య 43కు చేరింది. కొత్త కేసుల్లో జైపుర్​లో 11, అజ్మేర్​లో 6, ఉదయ్​పుర్​లో 3, మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్​ సోకింది. వైరస్​ బారిన పడిన వారిలో ఐదుగురు విదేశాల నుంచి రాగా.. వారితో కలిసిన ముగ్గురికి వైరస్​ పాజిటివ్​గా తేలింది.

దిల్లీలో 12 కేసులు

దేశ రాజధానిలో కొవిడ్​-19, ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 12 మందికి ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలింది. దీంతో దిల్లీలో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 79కి చేరింది. అందులో 23 మంది వైరస్​ను జయించారు.

కేరళలో 8

కేరళలో శుక్రవారం మరో 8 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్​ కేసుల సంఖ్య 37కు చేరినట్లు ఆరోగ్య మంత్రి వీనా జార్జ్​ తెలిపారు. తిరువనంతపురమ్​, కొల్లాంలో ఒక్కొక్కరు, అలప్పూజా, ఎర్నాకులం, త్రిస్సూర్​ జిల్లాల్లో ఇద్దరి చొప్పున వైరస్​ సోకినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వైరస్​ సోకిన తొలి వ్యక్తి కోలుకున్నారని తెలిపారు.

దేశంలో 436కు చేరిన సంఖ్య

మూడు రాష్ట్రాల్లో కొత్తగా 41 ఒమిక్రాన్​ కేసులు వెలుగు చూసిన క్రమంలో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 436కు చేరింది. మొత్తంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త వేరియంట్​ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 108 మంది ఒమిక్రాన్​ బారినపడగా.. ఆ తర్వాత దిల్లీలో 79, గుజరాత్- 43, రాజస్థాన్-​ 43, తెలంగాణ- 38, కేరళ- 37, తమిళనాడు- 34, కర్ణాటక- 31 కేసులు వచ్చాయి.

దేశంలో ఇప్పటివరకు 115 మంది ఒమిక్రాన్​ను జయించారు.

వైద్య కళాశాలలో వైరస్​ కలకలం

కర్ణాటక, కోలార్​లోని వైద్య కళాశాలలో కొవిడ్​-19 కలకలం సృష్టించింది. 33 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్​గా తేలినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఆసుపత్రిలోనే విద్యార్థులందరిని ఐసోలేషన్​కు పంపించినట్లు చెప్పారు.

ఒకే స్కూల్లో 19 మంది..

మహారాష్ట్ర అహ్మద్​నగర్​లోని జవహర్​ నవోదయ విద్యాలయ​ పాఠశాలలో 19 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు.

రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య ఇప్పటికే 100 దాటింది.

త్రిపురలో ఆంక్షలు..

ఒమిక్రాన్​ విస్తరిస్తున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో ఆంక్షలు విధించే అంశంపై ఆలోచన చేస్తోంది త్రిపుర ప్రభుత్వం. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క ఒమిక్రాన్​ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆంక్షలపై తర్జనాభర్జనలో ఉంది ప్రభుత్వం. మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బిప్లబ్​ కుమార్​ దేవ్​ సమావేశమైనట్లు సాంస్కృతి వ్యవహారాల మంత్రి సుసాంత చౌందరి తెలిపారు. రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసు నమోదు కానందున భయాందోళనలు అవసరం లేదన్నారు. విదేశాల నుంచి 69 మంది రాష్ట్రానికి రాగా.. 33 మంది నమూనాలు జినోమ్​ సీక్వెన్సింగ్​కు పంపించామని, 31 మందికి నెగెటివ్​ వచ్చినట్లు చెప్పారు. మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉందన్నారు. కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచించారు. జనవరి 1 నుంచి ఆంక్షలు విధించే అవకాశం ఉందన్నారు.

తమిళనాడుకు డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక..

ఒమిక్రాన్​ కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖను హెచ్చిరంచారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్​ సహా పలువురు నిపుణులు. పండగల సీజన్​లో జాగ్రత్తలు పాటించకపోవటం, అవసరమైన స్థాయిలో వ్యాక్సిన్లు లేకపవటం అందుకు కారణం కావచ్చన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, ఉన్నతాధికారులతో వర్చువల్​గా సమీక్షించారు స్వామినాథన్​. సన్నద్ధమయ్యేందుకు ఒమిక్రాన్​ సమయం ఇవ్వదని హెచ్చరించారు. యాంటీబాడీలు, రోగనిరోధక శక్తిని తప్పించుకుని వేగంగా వ్యాప్తిం చెందుతుందని తెలిపారు.

ఇదీ చూడండి:

Omicron symptoms: ఒమిక్రాన్‌ సోకిన 90% మందిలో ఇవి కామన్‌!

ఒమిక్రాన్​ భయాలు- 10 రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలు

Last Updated : Dec 25, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.