ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన గౌరి ప్రసాద్ అనే యువకుడు బ్రావో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. అతను ఏకంగా 97 సార్లు ప్లెట్లెట్స్ను.. 24 సార్లు రక్తదానం చేశాడు. గౌరి ప్రసాద్‌కు ఈ సేవాగుణం 16 ఏటనే ప్రారంభమైంది.
29 ఏళ్ల గౌరి ప్రసాద్ గత 13 ఏళ్లగా రక్తదానం చేస్తూ.. తన వంతుగా సామాజిక సేవ చేస్తున్నాడు. రక్తదానం చేస్తుండటంపై అతని తల్లిదండ్రులు మొదట వ్యతిరేకించారు. కానీ అతను గొప్ప లక్ష్యానికి పాటు పడుతుండటం వల్ల ప్రోత్సాహం అందించారు.
ఇదీ చదవండి : రేషన్ కుంభకోణం: ఇండోర్ వయా హైదరాబాద్!