ETV Bharat / bharat

ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్.. ఏమైందంటే? - ఒడిశా బార్​గఢ్ రైలు ప్రమాదం

ఒడిశాలో మరో రైలు పట్టాలు తప్పింది. ఐదు బోగీలు పక్కకు జరిగిపోయాయి. ప్రైవేటు ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. రైలు ఆ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలోనే నడుస్తుందని పేర్కొంది.

ODISHA TRAIN ACCIDENT
ODISHA TRAIN ACCIDENT
author img

By

Published : Jun 5, 2023, 11:28 AM IST

Updated : Jun 5, 2023, 12:48 PM IST

ఒడిశాలో మరో రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం నాటి ఘోర విషాదాన్ని మరువకముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. సున్నపురాయితో వెళ్తున్న గూడ్స్ రైలు బార్​గఢ్ వద్ద పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఐదు బోగీలు పట్టాలు తప్పి.. పక్కకు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. న్యారో గేజ్​ లైన్​పై ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు స్పష్టం చేశారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు.

'రైల్వే శాఖకు సంబంధం లేదు'
పట్టాలు తప్పిన గూడ్స్ రైలును ఓ ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీ నడిపిస్తోందని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. మెందపాలి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే రైలు పట్టాలు తప్పిందని వివరించింది. దానితో రైల్వే శాఖకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

goods-train-derailed-in-bargarh
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
goods-train-derailed-in-bargarh
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

"డుంగ్రీ సున్నపురాయి గనుల నుంచి ఏసీసీ బార్​గఢ్ సిమెంట్ ప్లాంట్ వరకు ప్రైవేటు న్యారో గేజ్ రైల్వే లైన్ ఉంది. ఈ రైలు పట్టాల నిర్వహణ, బోగీలు, లోకో పైలట్ల బాధ్యత అంతా ప్రైవేటు కంపెనీయే చూసుకుంటుంది. ఈ రైలు.. భారతీయ రైల్వే వ్యవస్థకు అనుసంధానమైనది కాదు. ఈ ఘటనకు ఏ విధంగానూ రైల్వే శాఖకు సంబంధం లేదు."
-ఈస్ట్ కోస్ట్ రైల్వే

రైలుకు పగుళ్లు.. తప్పిన ప్రమాదం!
తమిళనాడులో ఓ రైలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. కొల్లం జంక్షన్- చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లోని ‍ఓ బోగీ కింది భాగంలో ఏర్పడిన పగుళ్లను తమిళనాడులోని సెంగోట్టై రైల్వే స్టేషన్‌లో గుర్తించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్లు దక్షిణ రైల్వే అధికారులు పేర్కొన్నారు. పగుళ్లను గుర్తించిన రైల్వే సిబ్బంది ఆ బోగీని తొలగించి మధురైలో ప్రత్యామ్నాయంగా మరో బోగీని జోడించారు. చెన్నై- ఎగ్‌మోర్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌ త్రీ బోగీలో పగుళ్లను క్యారేజ్ వ్యాగన్ సిబ్బంది గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పగుళ్లను గుర్తించిన సిబ్బందిని సత్కరించి.. అవార్డును అందజేయనున్నట్టు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు.

మాటలకు అందని విషాదం
ఒడిశాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. మూడు రైళ్లు ప్రమాదానికి గురై ఈ ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. చెన్నై వైపు వెళ్తున్న కోరమాండల్ రైలు.. ప్రధాన లైన్ నుంచి కాకుండా లూప్​లైన్​లోకి వెళ్లడం ప్రమాదానికి కారణమైంది. లూప్​లైన్​లో ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఢీకొట్టింది. దీంతో కోరమాండల్ బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ బోగీలను బెంగళూరు-హవ్​డా సూపర్​ఫాస్ట్ ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.

Last Updated : Jun 5, 2023, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.