ETV Bharat / bharat

"అమరావతిపై.. అదే అక్కసు".. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ మొండిచెయ్యి - ఏపీ వార్షిక బడ్జెట్‌

NO FUNDS ALLOCATION TO AMARAVATI: రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తోంది. 3 రాజధానుల పేరుతో అమరావతి విధ్వంసానికి నడుం కట్టిన జగన్‌ సర్కార్.. ఈ సంవత్సరం బడ్జెట్‌లోనూ మొండిచెయ్యి చూపించింది. రాజధాని నిర్మాణం, ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధిపై హైకోర్టు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. వాటిని పెడచెవిన పెట్టింది. రాజధాని నిర్మాణానికి కేటాయింపులు చేయకుండానే అంకెల గారెడీ చేసి.. చేతులు దులుపుకుంది.

NO FUNDS ALLOCATION TO AMARAVATI
NO FUNDS ALLOCATION TO AMARAVATI
author img

By

Published : Mar 17, 2023, 7:42 AM IST

NO FUNDS ALLOCATION TO AMARAVATI: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి రాజధాని అమరావతిపై అక్కసు వెల్లగక్కుతూనే ఉంది. మూడు రాజధానుల పేరుతో అమరావతి విధ్వంసానికి పూనుకున్న జగన్‌ ప్రభుత్వం.. 2023-24 వార్షిక బడ్జెట్‌లోనూ మోసం చేసింది. అమరావతి అభివృద్ధిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి సంవత్సరం పూర్కైన.. ఒక్క ఇటుకా వేయని వైసీపీ.. తాజా బడ్జెట్‌లోనూ అదే ధోరణి కొనసాగించింది.

రాజధాని అమరావతికి మొత్తం 16వందల 28 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా బడ్జెట్‌లో చూపించి.. అంకెల గారడీ చేసింది. ఆ మొత్తంలో 500ల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయంగా వస్తుందని ఊహించి పెట్టింది. మిగతా మొత్తం గతంలో సీఆర్​డీఏ తీసుకున్న అప్పులకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించేందుకు.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు, భూమిలేని పేద కుటుంబాలకు పింఛన్లు చెల్లించేందుకు చేసిన కేటాయింపులే. అంతే తప్ప రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చించేందుకు కాదు. అమరావతి స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి 3 వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు చూపినా... అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్‌ను కూడా కలిపి చూపిందే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నికరంగా అంత ఖర్చు చేస్తుందన్న నమ్మకం లేదు.

కొత్త రాజధానిలో అత్యవసర మౌలిక వసతుల అభివృద్ధికి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలు కేటాయించింది. దానిని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వచ్చే హెడ్‌ కింద చూపింది. ఇదే హెడ్‌ కింద 2021-22 బడ్జెట్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు చూపినా.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2022-23 బడ్జెట్‌లోనూ ఇదే హెడ్‌ కింద 800 కోట్ల రూపాయలు చూపినా ఒక్క పైసా విదల్చలేదు.

రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో.. కేంద్ర ప్రభుత్వం 15 వందల కోట్ల రూపాయలు ఇచ్చింది. తర్వాత మరో వెయ్యి కోట్లు వరకు ఇస్తామని మౌఖికంగా హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం రాజధాని అమరావతికి 69 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం కావాలంటూ నీతి ఆయోగ్‌కు ప్రతిపాదనలు పంపింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు నిలిపివేయడంతో పాటు.. కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదు.

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, హడ్కో, అమరావతి బాండ్స్‌కు సంబంధించిన అసలు, వడ్డీ చెల్లించేందుకే... ఏపీ సీఆర్​డీఏ (A.P.C.R.D.A) కి సాయం పేరుతో బడ్జెట్‌లో కేటాయించిన 500 కోట్ల రూపాయలు. కొత్త రాజధానికి భూసమీకరణ పేరుతో కేటాయించిన 240 కోట్ల 9లక్షలు.. రాజధాని రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు మొత్తానికే సరిపోతుంది. రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి పేరుతో 87 కోట్ల 92 లక్షల రూపాయలు కేటాయించింది. రాజధాని గ్రామాల్లోని భూమి లేని పేద ప్రజలకు ప్రతి నెలా కౌలు చెల్లించేందుకు, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఈ సొమ్మును కేటాయించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన అమరావతి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుపైనా... రాష్ట్ర ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 500 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టాలన్నది ప్రాథమిక ప్రతిపాదన. టీడీపీ హయాంలో ప్రాజెక్టు అంచనాల్ని 2 వేల 46 కోట్ల రూపాయకు పెంచితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వెయ్యి కోట్లకు కుదించింది.

ప్రాజెక్టు గడువు వచ్చే జూన్‌తో ముగుస్తున్నా.. ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం 570 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించింది. గత బడ్జెట్‌లో అమరావతి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు కేటాయించినట్లు చూపించిన ప్రభుత్వం.. 123 కోట్ల 42 లక్షలే ఖర్చు చేసింది. ప్రస్తుత బడ్జెట్‌లో మళ్లీ 300 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. దీనిలో ఎంత ఖర్చు చేస్తారో చూడాలి. మరోవైపు చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులే 87 కోట్ల రూపాయల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.

"అమరావతిపై.. అదే అక్కసు".. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ మొండిచెయ్యి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.