ETV Bharat / bharat

డీజిల్​ ట్యాంకర్​-ట్రక్కు ఢీ.. 9 మంది సజీవ దహనం - మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం

డీజిల్​ ట్యాంకర్​-ట్రక్కు ఢీ
డీజిల్​ ట్యాంకర్​-ట్రక్కు ఢీ
author img

By

Published : May 20, 2022, 12:42 PM IST

Updated : May 20, 2022, 1:01 PM IST

12:35 May 20

డీజిల్​ ట్యాంకర్​-ట్రక్కు ఢీ

డీజిల్​ ట్యాంకర్​.. కలప తరలిస్తున్న ట్రక్కు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం మహారాష్ట్రలోని చంద్రాపుర్​లో జరిగింది. గురువారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. రెండు వాహనాలు ఢీకొనగానే మంటలు చెలరేగాయని.. ఈ క్రమంలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారని అధికారులు పేర్కొన్నారు.

ఘటనపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని.. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారని పోలీసులు తెలిపారు. పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాలను చంద్రాపుర్​ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : బిహార్​పై వరుణుడి పంజా.. 27 మంది మృతి

Last Updated : May 20, 2022, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.