ETV Bharat / bharat

నెల్లూరు, నిజామాబాద్​లోనూ PFI కలకలం.. ఎందుకీ దాడులు? అమిత్ షా లెక్కేంటి?

NIA Raids PFI: దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ అధికారులతో కలిసి 11 రాష్ట్రాల్లో PFI కార్యాలయాలు, సభ్యుల ఇళ్లలో విస్తృత తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే వందమందికి పైగా PFI సభ్యులను అరెస్ట్ చేసి.. మరిన్ని ఆధారాల కోసం జల్లెడ పడుతోంది. PFI కార్యకలాపాలు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం సహా ఉగ్రసంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారనే కోణంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తనిఖీల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

nia raids pfi
ఎన్​ఐఏ దాడులు
author img

By

Published : Sep 22, 2022, 12:24 PM IST

NIA Raids PFI: ఎన్​ఐఏ భారీ ఆపరేషన్.. 11 రాష్ట్రాల్లో ఒకేసారి సోదాలు.. పీఎఫ్​ఐ కార్యాలయాలపై ముప్పేట దాడి.. 106 మంది కార్యకర్తలు అరెస్ట్.. ఉదయం నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయాలివి. చరిత్రలో ఎన్నడూలేనంత స్థాయిలో గురువారం వేకువజాము నుంచే సోదాలు జరుపుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ. ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్​, ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్​ చేపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్​ఐఏ భారీ స్థాయిలో సోదాలు జరపడం, అనేక మందిని అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

nia raids pfi
ఎన్​ఐఏ సోదాలు
nia raids pfi
ఎన్​ఐఏ సోదాలు

అసలు ఎందుకీ ఆపరేషన్?
ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేవారు, ముష్కరుల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు, నిషేధిత సంస్థల్లో చేరేలా ప్రజల్ని ప్రభావితం చేసేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్​ చేపట్టామన్నది ఎన్​ఐఏ మాట. ఇటీవల అనేక వివాదాలతో వార్తల్లో నిలిచిన పాపులర్ ఫ్రంట్​ ఆఫ్ ఇండియా-పీఎఫ్​ఐ కార్యాలయలాపైనే జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధానంగా గురిపెట్టింది.

అరెస్టయిన వారు ఎవరు?
11 రాష్ట్రాల్లోని పీఎఫ్​ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేసింది ఎన్​ఐఏ. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ అరెస్టు చేసింది. ఇలా గురువారం ఒక్కరోజే కేరళలో(22), మహారాష్ట్ర, కర్ణాటకలో 20 చొప్పున, తమిళనాడులో (10), అసోంలో 9, ఉత్తర్​ప్రదేశ్​లో 8, ఆంధ్రప్రదేశ్​లో 5, మధ్యప్రదేశ్​లో 4, పుదుచ్చేరి, దిల్లీలో ముగ్గురు చొప్పున, రాజస్థాన్​లో ఇద్దరిని ఎన్​ఐఏ అరెస్టు చేసింది.
అయితే.. వారి వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించలేదు. పీఎఫ్​ఐ స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు వివరించింది. ఉగ్ర నిధులకు సంబంధించిన కేసుల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్, రాష్ట్రాల పోలీసులతో కలిసి ఈ అరెస్టులు చేసినట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ పీఎఫ్​ఐ ప్రభావం ఉందా?
ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోనూ ఎన్​ఐఏ సోదాలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. గుంటూరు, నెల్లూరు, నిజామాబాద్​లో జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. పాత గుంటూరులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన అధికారులు.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పీఎఫ్ఐతో సంబంధం ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు.

కేంద్రం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిందా?
పీఎఫ్​ఐ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. ఉదయం దేశవ్యాప్తంగా సోదాలు మొదలైనప్పటి నుంచి.. పరిస్థితుల్ని దిల్లీ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది కేంద్ర హోంశాఖ. ఇదే విషయమై జాతీయ భద్రతా సలహాదారు, హోంశాఖ కార్యదర్శి, ఎన్​ఐఏ డీజీతో దిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

అసలేంటీ పీఎఫ్​ఐ?
2006లో కేరళలో ఏర్పాటైంది పీఎఫ్​ఐ. ప్రస్తుతం దిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. అణగారిన వర్గాల సాధికారతే తమ లక్ష్యమని ఆ సంస్థ చెబుతూ ఉంటుంది. కానీ.. దేశంలోని భద్రతా సంస్థల వాదన మాత్రం భిన్నం. అతివాద ఇస్లాంను పీఎఫ్​ఐ ప్రోత్సహిస్తోందన్నది ప్రభుత్వ వర్గాల ప్రధాన ఆరోపణ.

పీఎఫ్​ఐపై ఇంకేమైనా కేసులు ఉన్నాయా?
అవును. పీఎఫ్​ఐపై ఇంతకముందు కూడా ఇలాంటి దాడులు జరిగాయి. పౌరసత్వ చట్టం వ్యతిరేక ఆందోళనలు, 2020 దిల్లీ అల్లర్లు, యూపీ హాథ్రస్​లో దళిత బాలిక సామూహిక అత్యాచారం వ్యవహారంలో కుట్ర సహా మరికొన్ని సందర్భాల్లో.. పీఎఫ్​ఐ ఆర్థిక వనరులు సమకూర్చిందన్న ఆరోపణలపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. లఖ్​నవూలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో ఇప్పటికే రెండు అభియోగ పత్రాలు కూడా దాఖలు చేసింది.

ఎన్​ఐఏ దాడులపై పీఎఫ్​ఐ స్పందనేంటి?
తమ సంస్థ కార్యాలయాలు, నేతల ఇళ్లల్లో సోదాలను తీవ్రంగా తప్పుబట్టింది పీఎఫ్​ఐ. ఈ దాడుల్ని.. అసమ్మతి వాణిని అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా నియంతృత్వ శక్తులు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించింది. మరోవైపు.. ఎన్​ఐఏ సోదాల్ని వ్యతిరేకిస్తూ కేరళ సహా వేర్వేరు రాష్ట్రాల్లో పీఎఫ్​ఐ కార్యకర్తలు నిరసనలకు దిగారు. వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

nia raids pfi
ఎన్​ఐఏ సోదాలు

ఇవీ చదవండి: ఉగ్ర నిధుల కేసులో ఎన్​ఐఏ సోదాలు.. 100 మంది అరెస్ట్​

బాలికపై గ్యాంగ్​ రేప్.. నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి.. 20 రోజులకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.