ETV Bharat / bharat

కొత్త హంగులతో 'వందే భారత్'​ రైళ్లు! - vande bharat trains in make in india

స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 'వందే భారత్' రైళ్లు మరిన్ని సౌకర్యాలతో ముందుకు రానున్నాయి. అత్యవసర ద్వారాలు, మెరుగైన సీటింగ్ వసతులు, అధునాతన కోచ్ పర్యవేక్షణ వ్యవస్థలు.. వంటి హంగులతో ఈ రైళ్ల కొత్త కోచ్ లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Vande Bharat train
వందే భారత్​ రైళ్లు
author img

By

Published : Aug 21, 2021, 5:27 AM IST

'మేకిన్ ఇండియా'లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 'వందే భారత్' రైళ్లు మరిన్ని సౌకర్యాలతో ముందుకు రానున్నాయి. అత్యవసర ద్వారాలు, మెరుగైన సీటింగ్ వసతులు, అధునాతన కోచ్ పర్యవేక్షణ వ్యవస్థలు.. లాంటి హంగులతో ఈ రైళ్ల కొత్త కోచ్ లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వారణాసి-దిల్లీ, కాట్రా-దిల్లీ మార్గంలో రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.

కొత్త కోచ్​ల్లో ప్రయాణికుల రక్షణకు అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే ఉన్న రెండు అత్యవసర ద్వారాలకు మరో రెండు జత చేస్తున్నారు. పుష్ బ్యాక్ సీటింగ్​ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు నాలుగు బల్బులను ప్రతీ కోచ్​లో అమరుస్తున్నారు. విపత్తు సమయంలో విద్యుత్ వ్యవస్థ విఫలమైనా ఈ అత్యవసర బల్బులు పనిచేస్తాయి. మార్చి 2022కల్లా ఈ కోచ్ తయారీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కేరళలో 20వేల కరోనా కేసులు- మిగతా రాష్ట్రాల్లో ఇలా..

ఇదీ చూడండి: 'మన లక్ష్యం 2024- కలిసి ముందుకు సాగుదాం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.