ETV Bharat / bharat

ఈనెల 12 నుంచి నీట్​ పీజీ కౌన్సెలింగ్​ - నీట్​ పీజీ కౌన్సెలింగ్​

NEET PG Counselling: నీట్​ పీజీ కౌన్సెలింగ్​ జనవరి 12న ప్రారంభకానున్నట్లు కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుక్​ మాండవియా తెలిపారు.

NEET PG Counselling
ఈనెల 12 నుంచి నీట్​ పీజీ కౌన్సెలింగ్​
author img

By

Published : Jan 9, 2022, 2:03 PM IST

Updated : Jan 9, 2022, 2:30 PM IST

NEET PG Counselling new date: వైద్య విద్య పీజీ ప్రవేశాలకు సుప్రీం కోర్టు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సెలింగ్​కు సిద్ధమైంది ప్రభుత్వం. నీట్​-పీజీ ప్రవేశాలు జనవరి 12న ప్రారంభవుతాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుఖ్​​ మాండవియా తెలిపారు.

వివాదం ఏమిటి?

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నీట్‌ పీజీ ఆల్‌ఇండియా కోటాలో ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)లకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2021, జులై 29న మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నోటిషికేషన్‌ జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొంతమంది నీట్‌ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పీజీ మెడికల్‌ కోర్సుల్లో రిజర్వేషన్ల విషయమై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా నీట్‌ పీజీలో రిజర్వేషన్లు కేటాయించారని, దీనివల్ల జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోయి మైనార్టీలుగా మిగిలిపోతారని పిటిషనర్లు ఆరోపించారు. ఇది ప్రతిభావంతులకు అవకాశాలు నిరాకరించడమే అవుతుందని పేర్కొన్నారు.

దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతుండగానే.. 2021 అక్టోబరు 25 నుంచి నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కేంద్రం ప్రకటించింది. దీంతో పిటిషనర్లు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం.. రిజర్వేషన్ల చెల్లుబాటుపై కోర్టు నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు కౌన్సెలింగ్‌ చేపట్టబోమని కేంద్రం కూడా హామీ ఇచ్చింది.

2021-22 ఏడాది నీట్​ పీజీ కౌన్సెలింగ్​కు అనుమతిస్తూ ఈనెల 7వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్య సీట్లలో.. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే నిర్వహించాలని స్పష్టం చేసింది. దీని ప్రకారం.. ఓబీసీలకు 27శాతం, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10శాతం రిజర్వేజన్​ కొనసాగనుంది.

ఇదీ చూడండి:

నీట్-పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతి

Last Updated : Jan 9, 2022, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.