ETV Bharat / bharat

దేశంలో 80 శాతం మందికి మొదటి డోసు పూర్తి - దిల్లీలో కరోనా కేసులు

భారత్​లో 80 శాతం మంది కరోనా టీకా మొదటి డోసును తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుమారు 38శాతం మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నట్లు స్పష్టం చేసింది.

Nearly 80 pc of India's eligible population administered first dose of COVID-19 vaccine
దేశంలో 80 శాతం మందికి మొదటి డోసు పూర్తి
author img

By

Published : Nov 12, 2021, 11:05 PM IST

భారతదేశంలోని వయోజనుల్లో 80 శాతం మంది కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు డోసులూ తీసుకున్న వారి సంఖ్య 38 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్​ అజ్ఞాని పేర్కొన్నారు. నవంబర్ 30 నాటికి దేశంలో మొదటి డోస్ టీకా తీసుకున్న వారి సంఖ్య 90 శాతానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కేరళలో స్వల్పంగా తగ్గిన కేసులు..

కేరళలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 6,674 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 59 మంది కొవిడ్​తో చనిపోయారు.

దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 62 మందిలో వైరస్​ నిర్ధరణ అయింది. మరో ఇద్దరు కరోనా కారణంగా చనిపోయారు.

మహారాష్ట్రలో కొత్తగా 925 కరోనా కేసులు వెలుగు చూశాయి. 41 మంది మరణించారు.

తమిళనాడులో 812 మందికి కొత్తగా వైరస్​ సోకింది. మరో 8 మంది వైరస్​తో చనిపోయారు.

వ్యాక్సినేషన్​..

దేశవ్యాప్తంగా 111 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 52 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: కేరళలో మరో కొత్త వైరస్​.. అత్యంత ప్రమాదకరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.