ETV Bharat / bharat

ఏసీ, ఫ్రిజ్​, ఇంటర్​నెట్​.. తెగ వాడేస్తున్న భారతీయులు! - భారత కుటుంబ ఆరోగ్య సర్వే వస్తువులు వినిమయోగా

భారతదేశంలో విలాసవంతమైన వస్తువుల వినియోగం గత అయిదేళ్లలో బాగా పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం ఎక్కువగా పెరగకపోయినా ఇంటర్నెట్​ మాత్రం భారీ పెరిగింది. ఏసీ, ఫ్రిజ్​, వాషింగ్​ మిషన్ల వాడకంలో పెరుగదల కనిపించింది. ప్రస్తుతం ప్రతి ఒకరి చేతిలో మొబైల్‌ ఉండటం వల్ల గడియారం వాడకం బాగా తగ్గింది.

vilasa bharat
vilasa bharat
author img

By

Published : May 10, 2022, 6:54 AM IST

National Family Health Survey 5: గత అయిదేళ్లలో దేశ సౌకర్యాల ముఖచిత్రం మారిపోయింది. విలాసవంత వస్తువుల వినియోగం పెరిగి పోగా.. ఇదే సమయంలో దారిద్య్రరేఖకు దిగువన ఉండే కార్డుల సంఖ్యలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 గణాంకాలను 2015-16 నాటి ఆరోగ్యసర్వే- 4తో పోల్చి చూస్తే దేశంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అయిదేళ్లలో ఫోన్లు, కంప్యూటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పులేకపోయినా ఇంటర్నెట్‌ వినియోగం మాత్రం భారీగా పెరిగింది. అలాగే ఏసీ/కూలర్లు, ప్రెజర్‌కుక్కర్ల వాడకంతో పాటు ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషన్ల వినియోగంలోనూ పెరుగుదల కనిపించింది.

పట్టణ ప్రాంతాల్లో కలర్‌ టీవీ వాడకం గత అయిదేళ్లలో 86% దగ్గరే నిలిచిపోగా.. అదే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 51.5% నుంచి 57.1%కి పెరిగిపోయింది. కాల క్రమంలో రేడియో, బ్లాక్‌ అండ్‌వైట్‌ టీవీ, ల్యాండ్‌లైన్లు, సైకిల్‌, ఎద్దుల బండ్ల వినియోగం తగ్గిపోతూ వస్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్‌ ఉండటం వల్ల గడియారం వాడకం కూడా తగ్గిపోయింది. కంప్యూటర్‌ వాడకం కూడా అయిదేళ్లలో కేవలం 0.3% పెరిగింది. ఇళ్లలో రోజువారీ అవసరాలకు ఉపయోగపడే సౌకర్య, విలాసవంతమైన వస్తువులు లేని వారి నిష్పత్తి అయిదేళ్ల క్రితం 0.8% మేర ఉండగా ఇప్పుడు అది సగానికి సగం పడిపోయి 0.4%కి తగ్గిపోయింది. గత అయిదేళ్లలో ద్విచక్ర మోటారు వాహన వినియోగం 37.7 నుంచి 49.7%కి పెరిగింది.

vilasa bharat
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 గణాంకాలు

ఇదే సమయంలో కార్లు వినియోగించే వారి నిష్పత్తి 1.5% మాత్రమే పెరిగింది. గత అయిదేళ్లలో ఎలాంటి వాహన సౌకర్యం లేని కుటుంబాల సంఖ్య 5.3%మేర తగ్గింది. బ్యాంకు అకౌంట్లు ఉన్న కుటుంబాలు, ఆరోగ్య బీమా కవరేజీ ఉన్నవారి సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ఈ గణాంకాల శైలిని బట్టి చూస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరిగినట్లు కనిపించింది. దేశంలో బీపీఎల్‌ కార్డులున్న కుటుంబాల సంఖ్య 2015-16లో 38.6% మేర ఉండగా, 2019-21నాటికి అది 45.1%కి చేరింది. దీన్ని బట్టి దేశంలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారి సంఖ్య పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: దివ్యాంగ చిన్నారికి విమానంలో నో ఎంట్రీ.. కేంద్రమంత్రి ఫైర్.. దిగొచ్చిన ఇండిగో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.