ETV Bharat / bharat

'ప్రజాభాగస్వామ్య పాలనకు 'మై గవ్​​' గొప్ప ఉదాహరణ​' - new National Education Policy

మై గవర్నమెంట్​ ప్లాట్​ఫామ్​ ఏర్పాటు చేసి ఏడేళ్లు పూర్తవుతున్న క్రమంలో ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పాలనలో ప్రజలను భాగం చేయటంలో 'మైగవ్​' అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జాతీయ నూతన విద్యా విధానం అమలులోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో జులై 29న జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ.

MyGov
ప్రధాని మోదీ
author img

By

Published : Jul 26, 2021, 8:28 PM IST

Updated : Jul 26, 2021, 10:53 PM IST

ప్రభుత్వంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాట్​ఫామ్​ 'మై గవర్నమెంట్​'పై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజా భాగస్వామ్య పాలనకు సరైన ఉదాహరణగా, యువతకు ప్రశ్నించే గొంతుకను ఇవ్వటంలో శిఖరాగ్రాన నిలిచిందని కొనియాడారు. ఈ ప్లాట్​ఫామ్​ను ఉపయోగిస్తూ సూచనలు చేసిన వలంటీర్లు, కంట్రిబ్యూటర్లను ప్రశంసించారు మోదీ.

మై గవర్నమెంట్​ ప్లాట్​ఫామ్​ ఏర్పాటు చేసి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ. 2014లో ఎన్​డీఏ సర్కారు తొలిసారి అధికారంలోకి వచ్చాక ఈ పోర్టల్​ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్​ చేసింది మైగవర్నమెంట్​ ఇండియా పోర్టల్​. 'ఏడేళ్ల ప్రయాణాన్ని అత్యంత విలువైనదిగా మార్చిన మైగ వర్నమెంట్​ సభ్యులకు కృతజ్ఞతలు. మైగవ్​.ఇన్​ ప్లాట్​ఫామ్​ ద్వారా మీ విలువైన సూచనలు అందించినందుకూ కృతజ్ఞతలు' అని పేర్కొంది.

జులై 29 జాతినుద్దేశించిన మోదీ ప్రసంగం

జాతీయ నూతన విద్యా విధానం(ఎన్​ఈపీ) అమలులోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న క్రమంలో జులై 29న జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ట్వీట్​ చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​

"ఎన్​ఈపీ-2020, అభ్యాస విధానాన్ని మార్చటం, విద్యను సమగ్రంగా అందించటం, ఆత్మనిర్భర భారత్​కు బలమైన పునాదులు వేసేందుకు మార్గదర్శకంగా మారింది. సంస్కరణలు చేపట్టి ఏడాది కావస్తున్నందున జులై 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు."

- ధర్మేంద్ర ప్రధాన్​, కేంద్ర విద్యా శాఖ మంత్రి.

నూతన విద్యావిధానం అమలులోకి వచ్చిన తర్వాత పురోగతి, విద్యావ్యవస్థలో కొత్త ప్రాజెక్టులు, వాటి కాలవ్యవధి వంటి విషయాలపై ప్రధాని మాట్లాడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: లోక్​సభ సీట్లు త్వరలోనే 1000కి పెంపు- నిజమెంత?

Last Updated : Jul 26, 2021, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.