ETV Bharat / bharat

దుబాయ్ నుంచి ముంబయికి ముగ్గురు ఉగ్రవాదులు... వరుస పేలుళ్లకు కుట్ర! - ముంబయిలో ఉగ్రదాడికి కుట్ర

వరుస పేలుళ్లకు పాల్పడేందుకు ముగ్గురు ఉగ్రవాదులు ముంబయిలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారంతా దుబాయ్​ నుంచి ముంబయి వచ్చినట్లు ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

mumbai police
mumbai police
author img

By

Published : Apr 8, 2023, 4:24 PM IST

Updated : Apr 8, 2023, 10:39 PM IST

పాకిస్థాన్​తో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు శుక్రవారం ముంబయిలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫోన్​ కాల్​ నిజమో కాదో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దర్యాప్తు చేపట్టిన పోలీసు బృందాలు ఇది బూటకపు ఫోన్​ కాల్​గా​ గుర్తించారు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

దుబాయ్​ నుంచి ముగ్గురు ఉగ్రవాదులు వచ్చినట్లు రాజా థోంగే అనే వ్యక్తి ముంబయి కంట్రోల్​ రూమ్​కు కాల్​ చేసి సమాచారం అందించాడు. శుక్రవారం తెల్లవారుజామున పాకిస్థాన్​తో సంబంధాలు ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు ముంబయి చేరుకున్నారని రాజా థోంగే కంట్రోల్​ రూమ్​కు ఫోన్​ చేసి చెప్పాడు. దుబాయ్​ నుంచి వచ్చిన ముగ్గురిలో ఒకరి పేరు ముజిమ్​ సయ్యద్​ అని.. అతని ఫోన్​ నంబర్​, కారు నంబర్​ను పోలీసులకు తెలిపాడు రాజా థోంగే. కంట్రోల్​ రూమ్​కు కాల్​ చేసిన రాజా థోంగ్​ తాను ఓ వ్యాపారినని ముంబయిలోనే ఉంటానని పోలీసులకు తెలిపాడు. అయితే ముంబయికి చెందిన ఓ సీనియర్​ పోలీసు అధికారికి కూడా ముగ్గురు ఉగ్రవాదులో నగరంలోకి ప్రవేశించి మెరుపు దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందింది.

రాజా థోంగే ఇచ్చిన సమాచారం ప్రకారం అప్రమత్తమైన ముంబయి పోలీసు యంత్రాగం ముజిమ్​ సయ్యద్​ కారు, ఫోన్​ నంబర్​ల ద్వారా విచారణ చేపట్టారు. ఈ ఫోన్ కాల్​​ నిజమా లేక నకిలీదా అనే గుర్తించేందుకు.. రాజా థోంగే నంబర్​ను కూడా ట్రేస్​ చేసే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, అతడి ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ వచ్చిందని వెల్లడించారు. గతంలో కూడా ముంబయి ట్రాఫిక్ పోలీసు​ విభాగం జాయింట్​ కమిషనర్​ ప్రవీణ్​ పడ్వాల్​కు రాత్రి 1 గంట సమయంలో ఇలాంటి కాల్స్​నే వచ్చింది. కమిషనర్​కు కాల్​ చేసిన ఆ వక్తి మీరా రోడ్​లో బాంబు పేలుడు జరుగుతుందని సమాచారం అందించాడు. అయితే పోలీసులు ఆ కాల్​​ నకిలీదని గుర్తించారు. ఇవే కాకుండా ట్రాఫిక్ పోలీస్​ కంట్రోల్​ రూమ్​ వాట్సాప్ నంబర్​కు వరుసగా బెదిరింపు కాల్స్​, మెసేజ్​లు వస్తున్నాయి.

'మోదీ, యోగిని చంపుతా'
దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ను​ చంపుతానంటూ ఓ వ్యక్తి ఏప్రిల్​ 3న బెదిరించాడు. ఆ అగంతకుడు ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలో ఉన్న ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఈ మెయిల్​ ద్వారా వెలడించాడు. దీంతో ఆ మీడియా సంస్థకు సంబంధించిన అధికారులు వెంటనే యూపీ పోలీసులుకు సమాచారం అందించారు. దేశ ప్రధానినే చంపుతామని బెదరింపులు రావడం వల్ల పోలీసులు ఈ కేసులు సీరియస్​గా తీసుకుని విచారణ చేపట్టారు. ఈ స్టోరీకి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Apr 8, 2023, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.