Mother Sold Daughter: పిల్లలు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన తల్లే.. డబ్బు కోసం తన సొంత కూతురుని వ్యభిచార కూపంలోకి దించింది. డబ్బుపై అత్యాశతో మూడుసార్లు విక్రయించింది. ఓ చిన్న తప్పిదం వల్ల అసలు విషయం బయటపడింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ ఉదంసింగ్ నగర్ జిల్లాలో రుద్రపుర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
అసలేమైందంటే..
డబ్బుపై ఆశతో బాలికను విక్రయించడం, వ్యభిచారం చేయించడమే పనిగా పెట్టుకుందో ఓ కిరాతక తల్లి. ఇందులో భాగంగా ఆ బాలికను మూడుసార్లు అమ్మేసింది. తర్వాత తిరిగి ఇంటికి చేరుకునేలా చేసుకుంది. ఈ విధంగా మరోసారి విక్రయించేందుకు ప్రయత్నించిందామె. అయితే ఈసారి నాటకీయంగా జరిగిన వ్యవహారంలో పోలీసులకు చిక్కింది.
ఈ ఘటనకు సంబంధించి ఇరువై రోజుల క్రితం బాధితురాలి తల్లి.. తన సోదరిపై ఫిర్యాదు చేసింది. "నా సోదరి మిండ్రో.. నా కుమార్తెను తన స్నేహితురాలు రష్మీ ఇంటికి పని కోసం పంపమని నన్ను కోరింది. ఇందుకోసం రష్మీ నా కుమార్తెకు డబ్బు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. దాంతో రుద్రపుర్‌లోని రష్మీ ఇంటికి నా కుమార్తెను పంపాను. కానీ 20 రోజుల తర్వాత నా కుమార్తె గురించి ఆరా తీస్తే.. ఆమెను మా సోదరి రూ.80,000కు విక్రయించినట్లు తెలిసింది" అని తన సోదరిపై ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ బాలిక తల్లి.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఈ వ్యవహారంలో బాధితురాలి తల్లి కూడా ఉన్నట్లు తేలింది. ఏడాదిన్నర కాలంగా ఆమె తన కూతురిని డబ్బు కోసం విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.
Sold Daughter for 200
బాధితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. "మహిళ తన కుమార్తెను గత ఏడాదిన్నరగా రూ.200ల కోసం వ్యభిచారం చేయిస్తోంది. ఆమెకు మూడు పెళ్లిళ్లు కూడా చేసింది. మూడుసార్లు అమ్మేసింది. ఈసారి కూడా బాలికను విక్రయించింది. అయితే ఆ బాలిక.. విక్రయించిన ప్రదేశం నుంచి పారిపోకపోవడం వల్ల ఆ మహిళ తన సోదరిపై ఫిర్యాదు చేసింది" అని ఉదమ్సింగ్ నగర్ ఎస్పీ మమతా బోహ్రా తెలిపారు.
ఈ కేసులో బాధితురాలి తల్లి, తన సోదరి సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 40 అడుగుల టవర్ ఎక్కి బాలుడు హల్చల్- కారణం తెలిస్తే..!