ETV Bharat / bharat

కుమారుడు లేడని.. ముగ్గురు కుమార్తెలను గొంతునులిమి చంపిన తల్లి - కుమార్తెలను హత్య చేసిన తల్లి

కన్నతల్లే ముగ్గురు చిన్నారుల పట్ల అమానవీయంగా ప్రవర్తించింది. కుమారుడు లేడని మనస్తాపంతో గొంతు నులిమి ముగ్గురు కుమార్తెలను హత్య చేసింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం బిహార్​లో జరిగింది.

mother killed daughters
హత్య
author img

By

Published : Sep 2, 2022, 6:48 PM IST

బిహార్​ బక్సర్​లో హృదయవిదారక ఘటన జరిగింది. ముగ్గురు కుమార్తెలకు ఓ తల్లి గొంతు నులిమి హత్య చేసింది. ఈ దారుణం బ్రహ్మపుర్​ సమీపంలోని గైఘాట్​ గ్రామంలో జరిగింది. నిందితురాలు పింకీ దేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికల మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో బాధితురాలు విస్తుపోయే నిజాలు చెప్పింది. కుమారుడు లేడనే బాధతోనే ఇలా చేసినట్లు తెలిపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు పింకీ దేవికి కుమారులు లేరు. తన సంతానంలో ముగ్గురు ఆడపిల్లలే. ఈ విషయం తలచుకుని నిందితురాలు నిత్యం బాధపడేది. అత్తమామలు సైతం ఆమెను తిట్టేవారు. మూడు రోజుల క్రితం తన తోడుకోడలికి బాలుడు జన్మించాడు. దీంతో పింకీ మరింత మనస్తాపానికి గురైంది. చివరకు ముగ్గురు కుమార్తెలను గొంతు నులిమి హత్య చేసింది. మృతులను పూనమ్​ కుమారి(10), రూనీ కుమారి(8), బబ్లీ కుమారిగా (3) గుర్తించారు.

''మా కోడలు మనుమరాళ్లకు భోజనం పెట్టింది. తెల్లవారిన ఇంకా బాలికలు గది నుండి బయటకు రాలేదు. దీంతో వారిని నిద్రలేపడానికి వెళ్లాం. అప్పటికే వారు ముగ్గురు మరణించి ఉన్నారు. బాలికల ముఖాలు నల్లగా ఉన్నాయి. ఇంట్లో మా కోడలు కనిపించలేదు. ఆమె పుట్టింటికి ఫోన్ చేశాం. అక్కడ లేదని చెప్పారు. ఇంట్లో రెండు తలుపులు తీసి ఉన్నాయి. విషం పెట్టి హత్య చేసిందేమో అని అనుమానించాం. కానీ పోలీసుల ఎదుట గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించింది.''

--నిందితురాలి అత్త

ఇవీ చదవండి: ప్రపంచంలో అతిపెద్ద హిందూ ఆలయం భారత్​లోనే.. త్వరలో ప్రారంభం

బర్త్​డే పార్టీకి వచ్చి గొడవ.. భవనం పైనుంచి తోసేసి హత్య.. 9ఏళ్ల బాలికపై వృద్ధుల రేప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.