ETV Bharat / bharat

బిల్లు అడిగారని కర్నల్​పై మూకదాడి.. కర్రలు, రాడ్​లతో బీభత్సం! - దుండగులు మూకదాడి

టపాసులు కొన్న తర్వాత జీఎస్​టీ బిల్లు విషయంలో ఓ దుకాణదారుడికి, కర్నల్​​కు మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో దుకాణదారుడి అనుచరులు కర్నల్​​, అతని కుమారుడిపై మూకదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

mob attack
మూకదాడి
author img

By

Published : Oct 27, 2022, 11:52 AM IST

టపాసులు కొన్న తర్వాత జీఎస్​టీ బిల్లు అడిగిన కర్నల్​పై మూకదాడి జరిగింది. 'కస్టమర్‌కు జీఎస్‌టీ బిల్లు ఇవ్వడం లేదు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో' అంటూ దుకాణదారుడు విమల్ సింఘానియా... కర్నల్​పై దాడికి దిగాడు. దాదాపు 20 మంది దుండగులు కర్నల్​, ఆయన కుమారుడిపై కర్రలు, రాడ్​లతో దాడి చేశారు. ఈ ఘటనలో కర్నల్​​కు, ఆయన కుమారుడికి తీవ్ర గాయాలై స్పృహ తప్పి పడిపోయారు. కర్నల్​ కుమారుడి కళ్లద్దాలు పగిలి అతని కంటికి గుచ్చుకున్నాయి. ఈ ఘటన ఝార్ఖండ్​లోని రాంచీలో జరిగింది.

రాజస్థాన్​లోని గంగా నగర్​లో విధులు నిర్వర్తిస్తున్న కర్నల్.. దీపావళి సందర్భంగా సెలవుపై స్వస్థలానికి వచ్చారు. కర్నల్, దుకాణదారుడు ఇరుగుపొరుగువారే. దుకాణదారుడు విమల్ సింఘానియా ఆదేశానుసారమే దుండగులు తనపై దాడికి పాల్పడ్డారని కర్నల్​ ఆరోపించారు. ఈ ఘటనపై కర్నల్​ కుమారుడు ఇషాన్ సింగ్ గోందా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దుకాణం బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దుకాణదారుని సోదరుడు కమల్ సింఘానియా తమకు క్షమాపణలు చెప్పాడని.. కేసు పెట్టొద్దని కోరాడని కర్నల్​ తెలిపారు.

'ఈ కేసుపై చివరి వరకు పోరాడతా. కేసును ఉపసంహరించుకోమని దుకాణదారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి దాడి ఇంకెవరి మీద జరగకుండా ఉండేందుకు న్యాయపరంగా పోరాటం చేస్తా. పోలీసుల నుంచి న్యాయం జరగకుంటే కోర్టును ఆశ్రయిస్తా. రాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్​కు కూడా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తా. దుకాణదారులు సింఘానియా సోదరులు తమను తాము పెద్ద వ్యక్తులుగా చెప్పుకుంటున్నారు. మాపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు.'
-కర్నల్​

మరోవైపు, డిస్కౌంట్ ఇవ్వకపోవడం వల్లే గొడవ తలెత్తిందని దుకాణదారుడు సింఘానియా సిబ్బందిలో ఒకరైన రాజేంద్ర ముండా ఆరోపించారు. ఈమేరకు కర్నల్​పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'క్రాకర్స్ కొనుగోలు చేసిన తర్వాత కర్నల్ డిస్కౌంట్ అడిగారు. రాయితీ లేదని చెప్పడం వల్ల తమపై దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారు. మా కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు' అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.