ETV Bharat / bharat

మంత్రికి చికిత్స చేస్తుండగా ఆస్పత్రిలో కరెంట్ కట్.. తర్వాత ఏమైందంటే? - మహారాష్ట్ర వార్తలు

రాష్ట్ర క్యాబినెట్​ మంత్రికి దంత చికిత్స చేస్తున్న సమయంలో ఆస్పత్రిలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక సెల్​ఫోన్​ వెలుగుల్లోనే వైద్యులు ట్రీట్​మెంట్​ పూర్తి చేశారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్​లో జరిగిందీ ఘటన.

guardian-minister-sandipan-bhumre-took-treatment-in-mobile-light-after-power-went-out

author img

By

Published : Oct 17, 2022, 2:56 PM IST

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ మంత్రికి దంత చికిత్స చేసే సమయంలో ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో వైద్యులు.. సెల్‌ఫోన్‌ కాంతిలోనే ట్రీట్​మెంట్​ను పూర్తి చేశారు.

ఇదీ జరిగింది..
నగరంలోని ఘటి ఆస్పత్రి తనిఖీకి క్యాబినెట్‌ మంత్రి సందీపన్‌ భుమ్రే వెళ్లారు. అక్కడి వైద్యులతో ఆయన దంత పరీక్షలు చేయించుకున్నారు. అయితే రూట్‌కెనాల్‌ చికిత్స చేసుకోవాల్సిందిగా సందీపన్​ను వైద్యులు సూచించారు. అయితే ఇప్పుడు రూట్​కెనాల్​ చేసేయమని సందీపన్..​ డాక్టర్లకు తెలిపారు.

guardian-minister-sandipan-bhumre-took-treatment-in-mobile-light-after-power-went-out
సెల్​ఫోన్​ వెలుగుల్లో మంత్రికి దంత చికిత్స

చికిత్స మొదలు పెట్టిన తర్వాత.. ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో వైద్యులు సెల్‌ఫోన్‌ కాంతిలోనే చికిత్స పూర్తి చేయాల్సి వచ్చింది. దీనిపై వివరణ అడగ్గా.. జనరేటర్‌ కావాలని కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను అక్కడిక్కడే ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.