ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మేరఠ్ పర్యటనకు ముందు బాంబు బెదిరింపులు(bomb threat news) కలకలం సృష్టిస్తున్నాయి. ఈనెల 11న (గురువారం) మేరఠ్‌కు వెళ్లనున్నారు సీఎం. ఈ క్రమంలోనే మేరఠ్ రైల్వే స్టేషన్‌ను బాంబుతో పేల్చివేస్తామని స్టేషన్ మాస్టర్‌కు లేఖ అందినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
లేఖ అందిన వెంటనే స్టేషన్ మాస్టర్ పోలీసులకు సమాచారం అందించారని అధికారులు తెలిపారు. స్టేషన్ మొత్తం అణువణువూ తనిఖీ చేశామని, ఎలాంటి అనుమానిత వస్తువు లభించలేదన్నారు. బాంబు బెదిరింపులు(bomb threat news) వచ్చిన క్రమంలో పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ జిల్లాలను అలర్ట్ చేశారు.
బాంబు బెదిరింపుల నేపథ్యంలో స్టేషన్‌తో పాటు రైళ్లలో తనిఖీలు చేపట్టి, భద్రతను కట్టుదిట్టం చేశారు రైల్వే అధికారులు. గాజియాబాద్, హపుర్, బులంద్‌షెహర్, షామ్లి, సహరాన్‌పుర్, ముజఫర్‌నగర్, మొరాదాబాద్ సహా ఇతర జిల్లాల్లోని రైల్వే స్టేషన్లలో బలగాలను మోహరించారు.
ఇదీ చూడండి: 'లఖింపుర్ ఘటన'పై యోగి సర్కార్‌కు నిరసన సెగ