ETV Bharat / bharat

17ఏళ్లుగా అడవిలోనే ఒంటరి జీవనం- కారులోనే నివాసం

కొన్నాళ్ల క్రితం వరకు విలాసవంతమైన జీవితం గడిపిన ఓ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో అడవిలోనే జీవిస్తున్నాడు. కారును ఆవాసంగా చేసుకొని.. 17ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాడు. ప్రపంచం సాంకేతికతలో దూసుకుపోతున్నప్పటికీ.. వాటికి దూరంగా.. ఆత్మగౌరవం కోసం ఉన్న ఊరును, సొంతవారిని విడిచి అడవిలోనే జీవనం సాగిస్తున్న అతను ఎవరు? ఎందుకు అలా అడవిలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు?

car man
కార్ మ్యాన్
author img

By

Published : Oct 8, 2021, 4:00 PM IST

Updated : Oct 8, 2021, 10:01 PM IST

17ఏళ్లుగా అడవిలోనే ఒంటరి జీవనం- కారులోనే నివాసం

కర్ణాటక మంగళూరు జిల్లా సుల్యాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరంతోడ్ గ్రామంలోని అద్దేల్-నెక్కారే అడవి. అందులో ప్రయాణిస్తుంటే ప్లాస్టిక్ కవర్ కప్పిన ఓ చిన్న గుడిసె తారసపడుతుంది. దానిలోపల ఆ రోజుల్లోనే లగ్జరీ వెహికిల్​గా పేరొందిన 'ప్రీమియర్ పద్మిని కారు', ఓ రేడియో, పాత సైకిల్ దర్శనమిస్తాయి. అలాగే ఆ గుడిసెలోనే మాసిన గడ్డం, పాత బట్టలు, అరిగిపోయిన చెప్పులతో ఓ వ్యక్తి దర్శనమిస్తాడు అతడే 56 ఏళ్ల చంద్రశేఖర్!

Chandrashekar old car
ఆత్మగౌరవ జీవి చంద్రశేఖర్

ఎంత ఆదాయం వచ్చినా.. విలాసవంతంగా జీవించాలని అనుకుంటున్న రోజులివి. అయితే అప్పట్లోనే సొంత కారు ఉండి.. ఉన్నంతలో లగ్జరీ జీవితాన్ని గడిపే.. ఆ వ్యక్తి అనూహ్యంగా ఎందుకు అడవిలోకి మకాం మార్చాల్చి వచ్చింది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 17 ఏళ్లుగా అడవిలోనే అతడు ఎందుకు నివాసం ఉంటున్నాడు?

అసలు కథ ఇదీ..

చంద్రశేఖర్​కు గతంలో నెక్రల్-కెమ్రాజీ అనే గ్రామంలో 1.5 ఎకరాల పొలం ఉండేది. దానిని సాగు చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవాడు. అయితే 2003 సంవత్సరంలో సహకార బ్యాంకు నుంచి రూ. 40వేల రుణం తీసుకున్నాడు. ఆ బాకీ తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దానిని చెల్లించలేకపోయాడు. దీంతో అతని పొలాన్ని బ్యాంక్ వేలం వేసింది. ఇది భరించలేని చంద్రశేఖర్ తనకిష్టమైన 'ప్రీమియర్ పద్మిని కారుతో' సోదరి వద్దకు వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తరువాత తన సోదరి కుటుంబంతో విభేదాలొచ్చాయి. దీంతో సొంత గ్రామానికి వెళ్లలేక.. ఆత్మగౌరవం అడ్డొచ్చి.. తనకెంతో ఇష్టమైన కారుతో అడవిలోనే ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఓ చోట కారును నిలిపి.. వర్షం, ఎండ నుంచి దానిని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్ కప్పాడు.

Chandrashekar old car
సైకిల్​తో చంద్రశేఖర్

ఉత్సాహ జీవితం..

అడవిలో ఒంటరిగా జీవిస్తున్న చంద్రశేఖర్ వద్ద పాత సైకిల్​తో పాటు.. ఓ రేడియో కూడా ఉంది. పాత హిందీ మెలోడీ పాటలను ఇష్టంగా వినే అతను.. జీవనోపాధి కోసం బుట్టలు తయారు చేసి.. సమీప గ్రామంలో విక్రయిస్తుంటాడు. వీటికి బదులుగా చిల్లర సరుకులు తీసుకుంటానని చెప్పాడు.

Chandrashekar old car
గుడిసె లోపలున్న కారు..

జంతువులతో హాని లేదు..

అడవి జంతువుల నుంచి తనకు ఎలాంటి హాని లేదంటున్నాడు చంద్రశేఖర్​. తన గుడారం దగ్గరనుంచే ఏనుగులు వెళ్తుంటాయని, అవి తనను ఏమీ అనవు అని చెబుతున్నాడు. చంద్రశేఖర్ కూడా అటవీ వనరులు, జంతువులకు ఎలాంటి హాని తలపెట్టట్లేదని.. అందువల్ల తమకు అతనితో ఎలాంటి సమస్య లేదని అటవీ శాఖ సిబ్బంది చెప్పడం విశేషం. ఇక్కడ జీవిచడం తనకెంతో బాగుందంటాడు చంద్రశేఖర్​.

Chandrashekar old car
చంద్రశేఖర్​కి ఇష్టమైన కారు.. ఇలా భద్రంగా..

"నేను అడవిలో చెట్లను నరకను. ఒక చిన్న మొక్కకు హాని చేసినా.. అటవీ శాఖ నాపై ఉంచిన నమ్మకాన్ని కోల్పోయినట్లే."

---చంద్రశేఖర్

నా కల అదే

ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్న చంద్రశేఖర్ గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇబ్రహీం.. స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి.. నిర్మించాడు కూడా. అయితే దానిని సున్నితంగా తిరస్కరించిన చంద్రశేఖర్.. తన ఇల్లు అడవిలోనే ఉందని చెప్పాడు.(తన కారే తన ఇల్లు అనే అర్థంలో)..!

Chandrashekar old car
తన గుడిసెను చూపిస్తున్న చంద్రశేఖర్

మరోవైపు.. చంద్రశేఖర్​కు ఆధార్ కార్డు సైతం లేదు. అయితే అరంతోడ్ గ్రామపంచాయతీ అతనికి కొవిడ్ టీకాను పంపిణీ చేసింది. లాక్​డౌన్ సమయంలో అడవిలో దొరికే పండ్లు, మంచినీటితో మాత్రమే జీవించానని తెలిపిన చంద్రశేఖర్.. 'నేను వేలంలో పొగొట్టుకున్న భూమిని తిరిగి పొందడమే జీవితంలో తనకున్న ఏకైక కోరిక' అని చెబుతున్నాడు. దానికి సంబంధించిన అన్ని పత్రాలను సురక్షితంగా భద్రపరిచినట్లు చెబుతున్నాడు చంద్రశేఖర్​.

Chandrashekar old car
చంద్రశేఖర్ కారు..

ఇవీ చదవండి:

Last Updated : Oct 8, 2021, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.