ETV Bharat / bharat

Man Shot minor girl : పెళ్లికి నిరాకరించిందని కోపం.. 13 ఏళ్ల బాలికను గన్​తో కాల్చి హత్య - అన్నావదినను చంపిన వ్యక్తి

Man Shot minor girl : పెళ్లికి నిరాకరించిందని బాలికను గన్​తో కాల్చి చంపాడు ఓ యువకుడు. ఈ దారుణం పంజాబ్​లో జరిగింది. మరోవైపు.. భూమి కోసం సొంత అన్నావదినలను హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

Man Shot minor girl
Man Shot minor girl
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 6:52 PM IST

Man Shot minor girl : పంజాబ్​లోని అమృత్​సర్​లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికను ప్రేమించమని ఒత్తిడి చేశాడు ఓ యువకుడు. అందుకు బాలిక నిరాకరించింది. దీంతో యువకుడు బాధితురాలిని గన్​తో కాల్చి చంపాడు.

గత కొంతకాలంగా ప్రేమించమని ఒత్తిడి..
అజ్నాల గ్రామానికి 23 ఏళ్ల యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన బాలికను (13) గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇది గమనించిన బాలిక తల్లిదండ్రులు.. ఆమెను బంధువుల ఇంటికి పంపించారు. గత ఆరు నెలలలుగా బాలిక మంచాల గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. మంగళవారం సాయంత్రం నిందితుడు.. బాలిక బంధువుల ఇంటికి వెళ్లాడు. బాలిక మెడపై గన్​ను పెట్టి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. బాలిక పెళ్లికి తిరస్కరించింది. దీంతో యువకుడు బాలికను కాల్చి చంపాడు. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

డ్రగ్స్​కు బానిసైన యువకుడు..
గత కొంతకాలంగా యువకుడు మత్తుపదార్థాలకు బానిస అయ్యాడని.. ప్రేమ పేరుతో తమ కుమార్తెను వేధించేవాడని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్​ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గొడ్డలితో సొంత అన్నవదిలను చంపిన....సోదరుడు
భూమి కోసం సొంత అన్న, వదినలను గొడ్డలితో నరికి చంపాడు ఓ వ్యక్తి. అనంతరం నిందితుడు పోలీసు స్టేషన్​లో లొంగిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్​లో జరిగిందీ దారుణం.

నుగ్గేనహళ్లి కొప్పలు గ్రామంలో శివలింగు(62), భారతి (55) దంపతులు నివసిస్తున్నారు. వీరికి 15 గుంటల భూమి ఉంది. ఆ భూమిలో వాటా కావాలని శివలింగు సోదరుడు హనుమంతు(60) గత కొంతకాలంగా అడుగుతున్నాడు. హనుమంతుకు వాటా ఇవ్వనని శివలింగ చెప్పాడు. ఈ విషయంలో అన్నాదమ్ముల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పంచాయతీ పెట్టినా రాజీ కుదరలేదు. ఎప్పటిలాగే శివలింగ దంపతులు మంగళవారం వ్యవసాయ పనులకు వెళ్లారు. అక్కడకు వచ్చిన హనుమంతు తనకు భూమిలో వాటా ఇవ్వాలని అన్న శివలింగను అడిగాడు. అందుకు శివలింగ నిరాకరించడం వల్ల కోపంతో ఉగిపోయిన హనుమంతు గొడ్డలితో అన్నపై దాడి చేశాడు. అలాగే అడ్డు వచ్చిన వదినపై పాశవిక దాడికి పాల్పడ్డాడు. దీంతో దంపలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితుడు హనుమంతు పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు.

Brother Raped Minor Sister in Maharashtra : చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన అన్న.. గర్భం దాల్చిన బాలిక.. ఆఖరికి..

Brother Murder : సోదరిపై వేధింపులు.. అడ్డుచెప్పిన సోదరుడి హత్య.. రాఖీకి 2రోజుల ముందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.