ETV Bharat / bharat

భార్యను హత్య చేసి స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టిన భర్త.. పోలీసులకు కట్టుకథ చెప్పి.. - భార్నను కిరాతకంగా చంపి పాతిపెట్టిన భర్త న్యూస్

భార్యను అతి కిరాతకంగా హత్యచేసి ప్రాణ స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టాడో భర్త. ఈ దారుణమైన ఘటన ఝార్ఖండ్ గిరిడీ​లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?

man killed his wife buried the body in his friend house
భార్యను చంపి స్నేహితుడి ఇంట్లో పాతి పెట్టిన భర్త
author img

By

Published : Feb 11, 2023, 10:42 AM IST

ఝార్ఖండ్​ గిరిడీ​లో ఓ వ్యక్తి తన భార్యను దుపట్టాతో గొంతునులిమి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని తన ప్రాణ స్నేహితుని ఇంట్లో పాతిపెట్టి సిమెంట్​తో పూడ్చిపెట్టాడు. అనంతరం ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
గిరిడీకి చెందిన మనీశ్ బర్న్​వాల్ అనే వ్యక్తి అర్జుమన్ బానో అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కూతురు పుట్టింది. ఇద్దరూ బాగానే ఉంటున్న సమయంలో దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అర్జుమన్ తన మొదటి భర్త సోదరుడితో తరచూ ఫోన్​లో మాట్లాడేది. అర్జుమన్ అలా చేయటం మనీశ్​కు నచ్చేది కాదు. దీంతో ఆమెను ఎలాగైనా చంపాలనే నిర్ణయించుకున్నాడు. అయితే 2021లో దుర్గాపూజకు తన భార్య, కూతురితో కలిసి కారులో మనీశ్.. స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో బగ్దీచౌక్​ వద్ద అర్జుమన్ తన తల్లితో ఫోన్​లో చాలా సేపు మాట్లాడింది.

మనీశ్ తన ఏడాదిన్నర కుమార్తె ముస్కాన్​తో కలిసి కారు దిగాడు. రాత్రి 9 గంటల సమయంలో కూతురికి కుందేలును చూపించి వస్తానని మనీశ్ తన భార్యకు చెప్పాడు. తన తల్లిలో ఫోన్​లో మాట్లాడుతున్న అర్జుమన్​ తన భర్త మాటలు విని సరే అని చెప్పింది. భార్యను చంపేందుకు ఇదే మంచి సమయం అనుకున్న మనీశ్... అర్జుమన్ దుపట్టాను ఉపయోగించి ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని మాల్దాకు తీసుకెళ్లి తన ప్రాణ స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టి సిమెంట్​తో పూడ్చిపెట్టాడు.

అయితే ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత పోలీసులను ఆశ్రయించాడు మనీశ్. 2022 జనవరి 21న పచ్చంబ పోలీసు స్టేషన్​లో తన భార్య కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. పోలీస్​ స్టేషన్​కు తన కూతురితో కలిసి వెళ్లి.. తన తల్లి లేకపోవడం వల్ల పాప పరిస్థితి దీనంగా మారిందని నిస్సహాయంగా చెప్పేవాడు. పదే పదే పోలీస్ స్టేషన్​కు వెళ్లి తన భార్య గురించి ఏమైనా తెలిసిందా అని అడిగేవాడు. మొదట్లో మనీశ్​పై పోలీసులకు అనుమానం రాలేదు. అయితే తన కూతురు అర్జుమన్​ను మనీశే హత్యచేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ఈ కేసుపై ఎస్పీ అమిత్ రేణు వారం రోజుల క్రితం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే మనీశ్ తన కూతురితో కలిసి మళ్లీ పోలీసు స్టేషన్​కు వచ్చి భార్య గురించి ఏమైనా తెలిసిందా అని అడగటం మొదలుపెట్టాడు. అయితే పోలీసులు ఈసారి మనీశ్ కూతురిని ఇంట్లో వదిలిపెట్టి అతడిని మాత్రమే స్టేషన్​కు రమ్మని పోలీసులు పిలిపించారు.

పోలీసులు తమదైన శైలిలో విచారించగా మనీశ్ అసలు విషయం బయపెట్టాడు. తన భార్య అర్జమన్​ను దుపట్టా ఉపయోగించి హత్య చేసి.. తన స్నేహితుడు రాజ్​కమల్ ఇంట్లో పాతిపెట్టి సిమెంట్​తో పూడ్చినట్లు మనీశ్ పోలీసులకు చెప్పాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఆమె మృతదేహాన్ని వెతికి తీసేందుకు పూడ్చిపెట్టిన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ లభించిన ఒక మానవ అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో మనీశ్​పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.