ETV Bharat / bharat

తండ్రిని హత్య చేసిన కుమారుడు.. రంపంతో ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో..

దిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్​ హత్యను పోలిన ఘటనలు మరో రెండు చోట్ల జరిగాయి. యువతిని హత్య చేసి నాలుగు రోజుల పాటు కారు డిక్కీలో దాచిపెట్టాడు. బంగాల్​లో జరిగిన మరో ఘటనలో తండ్రిని దారుణంగా చంపి.. ఆరు ముక్కలుగా నరికి పరిసర ప్రాంతాల్లో విసిరేశాడు ఓ కుమారుడు.

Girl dead body found in Bilaspur civil line

author img

By

Published : Nov 20, 2022, 4:18 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్​ హత్యను పోలిన ఘటన బంగాల్​లో జరిగింది. తండ్రిని హత్య చేసిన కుమారుడు.. ఆరు ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో పారేశాడు. అనంతరం తన తండ్రి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య, కుమారుడిపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో భార్య సహా అతడి కుమారుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బారుయ్​పుర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో నివసిస్తున్న ఉజ్వల్​ చక్రవర్తి.. నేవీలో పనిచేసి 12 ఏళ్ల కింద పదవీ విరమణ పొందారు. అతడి కుమారుడు పరీక్ష ఫీజు కోసం రూ.3వేలు అడగగా.. చక్రవర్తి అందుకు నిరాకరించాడు. దీంతో ఇరువరి మధ్య వివాదం తలెత్తింది. చక్రవర్తి.. కుమారుడిని కొట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన కుమారుడు.. తండ్రిని నెట్టేశాడు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన చక్రవర్తిని గొంతు నులిమి చంపేశాడు. తర్వాత బాత్​రూమ్​కు తీసుకెళ్లి శరీరాన్ని రంపంతో ఆరు ముక్కలు చేశాడు. ఆ శరీర భాగాలను ఓ సంచిలో మూటగట్టి పరిసర ప్రాంతాల్లో విసిరేశాడు.

యువతిని హత్య చేసి కారు డిక్కీలో దాచిపెట్టి
శ్రద్ధా వాకర్​ హత్య లాంటి మరో ఘటన ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​లో జరిగింది. ​ఓ యువతిని దారుణంగా హత్య చేసి కారు డిక్కీలో దాచిపెట్టాడు ఓ వ్యక్తి. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు ఆశిశ్​ సాహూను అరెస్ట్ చేశారు. హత్య చేసిన నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించారు.

బిలాయ్​కు చెందిన ప్రియాంక సింగ్​ అనే యువతి దయాల్​బంద్​ ప్రాంతంలో నివసిస్తూ.. స్టాక్​ మార్కెట్​లో పనిచేస్తోంది. గత నాలుగు రోజులుగా యువతి కనిపించకపోవడం వల్ల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆమె కాల్​ డేటాను పరిశీలించగా.. చివరగా ఆమెతో పనిచేస్తున్న ఆశిశ్​తో మాట్లాడినట్లు తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఆమె గొంతు నులిమి హత్య చేసి.. మృతదేహాన్ని కారులో దాచిపెట్టానని ఒప్పుకున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు డోరు తెరవగా ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించింది. నాలుగు రోజుల కింద హత్య చేయడం వల్ల మృతదేహం కుళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. యువతి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల​ నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. ఫలితాలు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

ఇవీ చదవండి: కుక్క పిల్లకు బారసాల.. లాలిపాటలు పాడుతూ వేడుక.. పేరేం పెట్టారంటే?

రాష్ట్ర స్థాయిలో హిజ్రాల సత్తా.. ప్రభుత్వ టీచర్లుగా ముగ్గురు ట్రాన్స్​జెండర్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.