భార్య, బావమరిది కలిసి బలవంతంగా బీఫ్ తినిపించారని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం గుజరాత్.. సూరత్‌లోని ఉఢానాలో జరిగింది. జూన్ 27న ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు కారణమైన నిందితులిద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడిని రోహిత్ సింగ్‌గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రోహిత్ సింగ్ సూరత్‌లోని టెక్స్టైల్ మిల్లులో రంగులు అద్దకం పని చేసేవాడు. అక్కడే అతడికి సోనమ్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరు వివాహం చేసుకున్నారు. రోహిత్ కుటుంబ సభ్యులు వీరిని ఇంటికి రానివ్వకపోవడం వల్ల రోహిత్, సోనమ్ వేరే కాపురం పెట్టారు. ఈ క్రమంలో తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య సోనమ్, బావమరిది
అక్తర్ అలీ తనను హింసిస్తున్నారని, బలవంతంగా బీఫ్ తినిపించారని ఆరోపిస్తూ
ఫేస్బుక్లో సూసైడ్ నోట్‌ను పోస్టు చేశాడు. ఈ సూసైడ్ నోట్‌ను రోహిత్
స్నేహితుడు చూడడం వల్ల దారుణం బయటపడింది.
"బీఫ్ తినకుంటే చంపేస్తామని మృతుడి భార్య సోనమ్, బావమరిది అక్తర్ బెదిరించారు. ఓ రోజు బలవంతంగా బీఫ్ తినిపించారు. దీంతో రోహిత్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు సూసైడ్ నోట్ రాసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు బాధితుడు. రోహిత్ స్నేహితుడు సోషల్ మీడియాలో సూసైడ్ నోట్‌ను చూడడం వల్ల దారుణం బయటపడింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం. నిందితులిద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం."
-పోలీసులు
ఇవీ చదవండి: ఇంట్లో బంగారు నిధి, గుట్టుగా పంచుకున్న కూలీలు, తప్పతాగి నోరుజారేసరికి
చీమల దండయాత్ర, చూపు కోల్పోతున్న పశువులు, వలస వెళ్తున్న ప్రజలు