రూ. 500 కోసం మొదలైన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన అసోం రంగాపాడాలోని దయాల్పుర్ గ్రామంలో ఆగస్టు 15న అర్ధరాత్రి జరిగింది. ఘటన తర్వాత మృతుడి తలతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దయాల్పుర్ గ్రామానికి చెందిన తునీరామ్ మాద్రి.. బ్రోయిలర్ హేమ్రామ్(55) తల నరికాడు. అనంతరం ఆ తల, కత్తి పట్టుకొని 10 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
ఇదీ జరిగింది.. హేమ్రామ్కు రూ. 500 అవసరమై మాద్రిని అడిగాడు. నిరాకరించిన మాద్రిని బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. కోపోద్రిక్తుడైన తునీరామ్ మాద్రి ఆవేశంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో హేమ్రామ్ మెడపై వేటు వేశాడు. ఆ తల పట్టుకొని పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఆకాశంలో త్రివర్ణం రెపరెపలు, జాతీయ జెండాతో గాల్లో చక్కర్లు కొట్టిన గద్ద