ETV Bharat / bharat

విమానంలో 'హైజాక్​' అంటూ ఫోన్​లో ముచ్చట్లు.. నిమిషాల్లో ప్రయాణికుడి అరెస్ట్​! - మద్యం మత్తులో ప్రయాణికురాలిపై మూత్రం

Aeroplane Hijack In Mumbai Airport : విమానంలో హైజాక్​ గురించి ఫోన్లో మాట్లాడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేసి.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ముంబయి పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. ముంబయి, పుణెలో పేలుళ్లకు పాల్పడతానని బెదిరించాడు.

hijack arrest
hijack arrest
author img

By

Published : Jun 23, 2023, 2:03 PM IST

Updated : Jun 23, 2023, 2:33 PM IST

Aeroplane Hijack In Mumbai Airport : విమానంలో హైజాకింగ్​ గురించి ఫోన్లో మాట్లాడిన ఓ వ్యక్తిని ముంబయి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడిపై భారత శిక్షా స్మృతి (ఐపీసీ) 336 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.

'ముంబయి నుంచి దిల్లీకి వెళ్లాల్సిన విస్తారా విమానంలో.. ఓ ప్రయాణికుడు హైజాకింగ్​ గురించి ఫోన్లో మాట్లాడాడు. అది విన్న విమాన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు' అని ఓ అధికారి తెలిపారు. అయితే, పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తికి మానసిక స్థితి సరిగా లేదని.. 2021 నుంచి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసిందని చెప్పారు.

పోలీసులకు బెదిరింపు కాల్స్..
Mumbai Police Threat Call : మహారాష్ట్ర.. ముంబయి పోలీసులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబయి, పుణెలో బాంబు పేలుళ్లకు పాల్పడతానని ముంబయి పోలీస్ కంట్రోల్​ రూమ్​కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. జూన్​ 24న ముంబయిలోని అంధేరీ, కుర్లా ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయని హెచ్చరించాడు. గురువారం ఉదయం 10 గంటలకు నిందితుడు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో ముంబయి పోలీసులు, భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ బెదిరింపు కాల్ ఎవరు చేశారు? ఎక్కడ నుంచి చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేగాక తనకు రూ.2 లక్షలు అవసరం అని.. ఈ మొత్తం ఇస్తే బాంబు పేలుళ్లకు పాల్పడనని చెప్పాడు. వెంటనే పోలీసులు విచారణ జరిపి నిందితుడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన బెదిరింపు కాల్​ చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.

మద్యం మత్తులో హల్​చల్​..
ఈ ఏడాది ఏప్రిల్​లో మద్యం మత్తులో ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్​చల్ చేశాడు. దిల్లీ-బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో అత్యవసర ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించాడు. అతడిని విమాన సిబ్బంది నిలువరించారు. ఈ ఘటనలో కాన్పుర్​కు చెందిన ప్రయాణికుడు ప్రతీక్​ (30)ను సీఐఎస్​ఎఫ్ సిబ్బందికి అప్పగించినట్లు ఇండిగో పేర్కొంది. ప్రయాణికుడిపై అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ప్రయాణికురాలిపై మూత్రం..
ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. న్యూయార్క్- దిల్లీ మధ్య ప్రయాణిస్తున్న ఫ్లైట్​లో తోటి ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్రం పోశాడు. నిందితుడు మద్యం మత్తులో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పందించింది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Jun 23, 2023, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.