ETV Bharat / bharat

ఫ్లెక్సీ వివాదంలో యువకుడు ఆత్మహత్య - పరామర్శించేందుకు సిద్ధమైన మహాసేన రాజేష్ గృహనిర్బంధం - dalit youth suicide in east godavari district

Mahasena Rajesh House Arrest: మహాసేన రాజేష్​ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఫ్లెక్సీ వివాదంలో స్టేషన్‌కు పిలిచారనే మనస్తాపంతో మహేంద్ర అనే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన మహాసేన రాజేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

Mahasena_Rajesh_House_Arrest
Mahasena_Rajesh_House_Arrest
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 11:43 AM IST

Mahasena Rajesh House Arrest: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహాసేన రాజేష్​ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో ఆత్మహత్యకు పాల్పడిన దళిత యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మహాసేన రాజేష్ సిద్ధమవగా.. అతనిని అడ్డుకున్నారు.

అధికార పక్షం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చించేసిన వివాదంలో.. స్టేషన్​కు పిలిచారనే మనస్తాపంతో మహేంద్ర అనే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన మహాసేన రాజేశ్‌ను గృహనిర్బంధం చేశారు. మరోవైపు దొమ్మేరులో ఎస్సీ యువకుడు మహేశ్ అంత్యక్రియలకు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.

దళిత యువకుడి ముఖంపై మూత్రం! ఘటనపై భగ్గుమన్న దళిత సంఘాలు, విపక్షాలు!

Tension in in Dommeru as Dalit Youth Suicide:

అర్ధరాత్రి నిరసనల హోరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు అర్ధరాత్రి వేళ నిరసనలతో అట్టుడికింది. అధికార పక్షం ఏర్పాటుచేసిన ఓ ఫ్లెక్సీని చించివేసిన ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన దళిత యువకుడు బొంతు మహేంద్ర (23) పురుగుల మందు తాగారు. కొవ్వూరు, చాగల్లు, రాజమహేంద్రవరంలోని వివిధ హాస్పిటల్స్​లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో విజయవాడకు తరలిస్తుండగా మృతి చెందారు.

మహేంద్ర మృతదేహాన్ని విజయవాడ నుంచి బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో దొమ్మేరుకు తీసుకొచ్చారు. అప్పటికే గ్రామస్థులు, దళిత యువత పెద్దఎత్తున ప్రధాన కూడలికి చేరుకుని నిరసనకు దిగారు. రహదారి మధ్యలో నిరసనలు చేస్తూ రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీసు అధికారులు స్పందించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏఆర్‌ కానిస్టేబుళ్లు, సిబ్బందిని రప్పించారు.

Kadiyam Police Harrased Dalith Young man: పోలీసుల దాష్టీకం.. దళిత యువకుడిపై థర్డ్ డిగ్రీ!

న్యాయం జరగాలంటూ..: అంబులెన్స్‌ నుంచి మహేంద్ర మృతదేహాన్ని దించిన సమయంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. యువత పెద్దగా కేకలు వేస్తూ పోలీసు సిబ్బందితో గొడవకు దిగారు. మృతదేహాన్ని ఊరేగిస్తామంటూ పట్టుబట్టడంతో తోపులాటకు దారితీసింది. న్యాయం జరగాలి.. జోహార్‌ మహేంద్ర అంటూ నినదాలు చేశారు. జనసేన నియోజకవర్గ ఇంఛార్జి టీవీ రామారావు యువతతో మాట్లాడి సంయమనం పాటించాలని కోరారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లగా.. మళ్లీ కూడలి వద్దకు తెచ్చారు.

అడిషనల్‌ ఎస్పీ నళిని, అడిషనల్‌ క్రైమ్‌ ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ వీఎస్‌ఎన్‌ వర్మ, సీఐ వి.జగదీశ్వరరావు, సిబ్బంది పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. పెనకెనమెట్టలో హోంమంత్రి వనిత గడప గడపకు కార్యక్రమంలో ఉన్నారని తెలుసుకొని మృతదేహాన్ని అక్కడకు తీసుకేళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినా కొందరు వెంబడించి మంత్రి అనుచరుల వాహనాలపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొవ్వూరులో ఉన్న హోంమంత్రి క్యాంపు ఆఫీస్​లో పోలీసులు భద్రత పెంచారు.

Dalit Associations round table ఎస్సీలు ఏకం కావాలి.. దళితుల రక్షణ కోసమైనా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి: మందకృష్ణ

సీసాలు, రాళ్లు విసిరి..: రాత్రి 10.30 గంటల సమయంలో కొంతమంది రాళ్లు, సీసాలు.. పోలీసులపైకి విసిరారు. అదనపు ఎస్పీ (క్రైమ్‌) గోగుల వెంకటేశ్వరరావుకు అవి తగలడంతో ఆయన తలకు గాయమైంది. దొమ్మేరులో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. జిల్లా ఎస్పీ జగదీష్‌ అర్ధరాత్రి వేళ చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు.

రూ.10 లక్షల పరిహారమివ్వాలి..: ‘ఈ నెల 17వ తేదీన పుట్టినరోజని.. తప్పకుండా రావాలంటూ పిలిచాడు.. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మహేంద్ర కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది' అని మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తెలిపారు. 200 రూపాయల ఫ్లెక్సీ కోసం మనిషి ప్రాణాన్ని తీసేశారన్నారు. ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని.. మహేంద్ర మృతికి ఎవరు సమాధానం చెబుతారన్నారన ప్రశ్నించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిచ్చి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల వైఖరి కారణంగానే మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.

భయపడిందే జరిగింది - దళిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులపై వైసీపీ నేత వర్గీయుల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.