ETV Bharat / bharat

యాప్​లో రూ.5వేలు లోన్.. వడ్డీతో కలిపి రూ.80వేలు బాదుడు.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య - లోన్ యాప్ వేధింపులు

లోన్​ యాప్​ నిర్వాహకుల ధనదాహానికి మరొక ప్రాణం బలైంది. మూడు నెలల క్రితం రూ.5వేలు అప్పు ఇచ్చి.. రూ.80వేలు కట్టాలని ఓ లోన్​ యాప్​ సిబ్బంది వేధించగా.. 23ఏళ్ల ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై కేకే నగర్​లో సోమవారం జరిగిందీ ఘటన.

loan app harassment
లోన్​ యాప్​కు మరో ప్రాణం బలి
author img

By

Published : Oct 4, 2022, 10:56 AM IST

లోన్​ యాప్​ సిబ్బంది వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై కేకే నగర్​లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు నెలల క్రితం లోన్​ యాప్​లో రూ.5వేలు రుణం తీసుకున్న అతడ్ని.. ఏకంగా రూ.80వేలు కట్టాలని బెదిరించడమే ఇందుకు కారణంగా తెలిసింది.

ఇదీ జరిగింది..
నరేంద్రన్(23) బీకామ్ చదివాడు. చెన్నైలోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం ఓ లోన్​ యాప్​ ద్వారా రూ.5000 అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించేందుకు సమయానికి డబ్బు అందలేదు. అందుకే.. మరో లోన్​ యాప్​ నుంచి అప్పు తీసుకుని పాత రుణం కట్టేశాడు.

కొద్ది రోజులకు లోన్​ యాప్​ సిబ్బంది నరేంద్రన్​కు ఫోన్​ చేశారు. కొత్తగా తీసుకున్న అప్పు క్లియర్ చేసేందుకు రూ.33వేలు కట్టాలని చెప్పారు. త్వరగా చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పదేపదే హెచ్చరించారు. అతడ్ని బూతులు తిట్టారు. ఈ వేధింపులు తట్టుకోలేక తండ్రి దగ్గర రూ.33వేలు తీసుకున్నాడు నరేంద్రన్.
అప్పు చెల్లిద్దామని చూస్తే.. లోన్​ యాప్​ సిబ్బంది మరో షాక్ ఇచ్చారు. రుణం తీరాలంటే రూ.50వేల కట్టాలని తెగేసి చెప్పారు. ఫలితంగా నరేంద్రన్​ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. చేసేది లేక.. మరో లోన్​ యాప్​ నుంచి రూ.50వేలు తీసుకుని, పాత లోన్​ కట్టేశాడు.

loan app harassment
మృతుడు నరేంద్రన్(పాత చిత్రం)

15 రోజుల తర్వాత లోన్​ యాప్ సిబ్బంది వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. రూ.50వేలు అప్పు తీరాలంటే రూ.80వేలు కట్టాలని చెప్పారు. లేదంటే నరేంద్రన్ ఫొటోలు మార్ఫ్​ చేసి, అతడి ఫోన్ కాంటాక్ట్స్​లో ఉన్న అమ్మాయిలకు పంపుతామని బెదిరించారు. ఆ యువకుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. సోమవారం ఉదయం అతడి తల్లిదండ్రులు ఊరెళ్లగా.. ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు నరేంద్రన్.
యువకుడి బంధువు ఒకరు ఈ విషయం గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఎంజీఆర్​ నగర్​ పోలీసులు వచ్చి మృతదేహాన్ని శవపరీక్షకు పంపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఎన్ని చర్యలు తీసుకున్నా..
ఆన్‌లైన్‌లో అప్పులిచ్చే రుణ యాప్‌ల దారుణాలు ఇటీవల ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వడ్డీలతో బాదుతూ, సకాలంలో చెల్లించలేదనే పేరిట తీవ్రస్థాయి వేధింపులకు పాల్పడుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేలా కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ లోన్​ యాప్స్​ అసలు యాప్ స్టోర్స్​లో కనిపించకుండా చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం చట్టబద్ధమైన లోన్​ యాప్​ల వివరాలతో వైట్​ లిస్ట్ తయారు చేయాలని రిజర్వు బ్యాంకును ఆర్థిక శాఖ ఆదేశించింది. ఆ వైట్​ లిస్ట్​లోని లోన్​ యాప్​లు మాత్రమే ఆండ్రాయిడ్, యాపిల్ యాప్​ స్టోర్స్​లో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్మల నేతృత్వంలో గత నెలలో జరిగిన భేటీలో నిర్ణయించారు. అక్రమ లోన్​ యాప్​ల ఆటలు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు. చట్టవిరుద్ధ రుణ యాప్​ల లావాదేవీలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్, కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ దృష్టి సారించేలా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.