మధ్యప్రదేశ్‌లో ఆహార పదార్థాలను కల్తీ చేసిన నేరానికి గతంలో ఆరు నెలల జైలు శిక్ష ఉండేది. ఆ తర్వాత దాన్ని మూడేళ్లకు పెంచారు. అయితే ఈ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో శిక్షను జీవిత ఖైదుకు పెంచుతూ ఐపీసీ చట్టాల్లో సవరణలు చేశారు. ఇటీవల ఈ సవరణల గురించి రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్ అసెంబ్లీలో వెల్లడించారు. తాజాగా వీటిపై రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా... ఇకపై ఆహార కల్తీకి పాల్పడితే జీవితకాలం జైల్లో ఉండాల్సిందేనని తెలిపారు. ఇలాంటి వారు నేరుగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, ఇంతకంటే పెద్ద నేరమేమీ ఉండదని ఆయన అన్నారు. అంతేగాక, గడువు ముగిసన పదార్థాలు విక్రయించినా కూడా శిక్ష పడుతుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి:మూగజీవాల పొట్ట నిండా ప్లాస్టిక్ వ్యర్థాలే!