తమకు ఎదురైన ఓ కేసుతో కర్ణాటక కిమ్స్ ఆస్పత్రి వైద్యులు (Kims hospital hubli) షాక్ అయ్యారు. ఈ శనివారం(నవంబర్ 20) ఉదయం 32 ఏళ్ల ఓ వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడు. ఓ చేతిలో వాటర్ పైప్ ఉండగా.. అతడి మలాశయంలో టాయిలెట్ జెట్ స్ప్రే (Toilet jet spray struck in rectum) ఇరుక్కుపోయింది.
అది గమనించిన వైద్యులు.. వెంటనే ఆపరేషన్ చేసి దానిని బయటకు తీశారు.
ఇదో అరుదైన, సంక్లిష్టమైన కేసు అని తెలిపిన వైద్యులు.. ఇలాంటిది ఇప్పటివరకు చూడలేదని పేర్కొన్నారు. సమయం వృథా చేయకుండా.. నిపుణులైన వైద్యబృందం సాయంతో స్ప్రేయర్‌ను తొలగించినట్లు తెలిపారు.
ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉన్నాడని, ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు.
తాగిన మత్తులోనే..
మద్యం మత్తులోనే స్ప్రేయర్‌ను మలాశయంలోకి చొప్పించుకున్నట్లు తెలుస్తోందని ఆ వ్యక్తిని తీసుకొచ్చిన స్నేహితుడు తెలిపాడు.
దీనిని తీవ్రంగా పరిగణించిన ఆస్పత్రి యాజమాన్యం.. ఆ వ్యక్తిపై మెడికో లీగల్ కేసు నమోదు చేసింది.
బాధితుడిని బంగాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బైరిదేవరకొప్ప గ్రామంలో భవన నిర్మాణ పనులు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నాడని తెలిసింది.
ఇదీ చూడండి: మసాజ్ సెంటర్ల ముసుగులో సెక్స్ రాకెట్- 151 చోట్ల పోలీస్ రైడ్