ETV Bharat / bharat

స్కూల్​ విద్యార్థుల బస్సుకు ఘోర ప్రమాదం- 9 మంది మృతి - palakkad tourist bus Incident

kerala bus accident
స్కూల్​ విద్యార్థుల బస్సుకు ఘోర ప్రమాదం
author img

By

Published : Oct 6, 2022, 7:07 AM IST

Updated : Oct 6, 2022, 4:15 PM IST

07:01 October 06

స్కూల్​ విద్యార్థుల బస్సుకు ఘోర ప్రమాదం

kerala bus accident
ప్రమాదానికి గురైన ఆర్​టీసీ బస్సు

కేరళ పాలక్కడ్​లో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. పాలక్కడ్​ జిల్లా వడక్కంచేరి వద్ద గురువారం అర్ధరాత్రి ఓ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు, కేరళ ఆర్​టీసీ బస్సును ఢీకొట్టడం.. ఈ పెను విషాదానికి కారణమైంది.

ఎర్నాకుళం జిల్లా మూలంతురుతిలోని ఓ పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు.. ఓ టూరిస్ట్ బస్సులో ఊటీకి విహార యాత్రకు వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత టూరిస్ట్ బస్సు వడక్కంచేరి వద్ద వేగంగా వెళ్లి.. కేఎస్​ఆర్​టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. వెంటనే విద్యార్థులు ఉన్న బస్సు అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న కాల్వలోకి పడిపోయింది.

ప్రమాద సమయంలో ఆర్​టీసీ బస్సు 49 మంది ప్రయాణికులతో కొట్టరక్కర నుంచి కోయంబత్తూర్ వెళ్తోంది. ఆర్​టీసీ బస్సులోని ప్రయాణికుల్లో ఒకరు మరణించారు. టూరిస్ట్​ బస్సులోని ఓ టీచర్ మరణించగా.. మిగిలిన మృతులంతా విద్యార్థులని తెలిసింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించారు.

మోదీ సంతాపం..
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు పీఎంఓ ట్వీట్ చేసింది. గాయపడ్డవారికి రూ.50వేలు అందించనున్నట్లు తెలిపింది.

Last Updated : Oct 6, 2022, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.