ETV Bharat / bharat

కార్తిక మాసం ఏ రోజు నుంచి ప్రారంభం? ముఖ్యమైన తేదీలివే!

Karthika Masam 2023 Date : హిందువులకు కార్తిక మాసం అత్యంత పవిత్రమైనది. కార్తిక మాసం దీపావళి పండగ మరునాడు ప్రారంభమవుతుంది. కానీ ఈ సారి దీపావళి పండగ మరుసటి రోజు కాకుండా రెండో రోజు నుంచి మొదలవుతోంది. కారణం ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

When Karthika Masam Start In 2023
When Karthika Masam Start In 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 1:21 PM IST

Karthika Masam 2023 Date and Important Days in Telugu: హిందూ సంప్రదాయాలల్లో కార్తిక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపాల కాంతితో కళకళలాడే ఆలయాలు.. శివనామస్మరణలు, భక్తుల ఉపవాసాలు, అయ్యప్ప దీక్ష.. కార్తిక మాస ప్రత్యేకతలు. హరిహరులకు ఇష్టమైన మాసంగా పరిగణించే ఈ నెలలో చేసే పూజలకూ, వ్రతాలకూ విశేషమైన ఫలితం ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

కారణం ఇదే: సాధారణంగా దీపావళి తరువాతి రోజు నుంచి కార్తికం ప్రారంభమవుతుంది. అయితే ఈసారి దీపావళి తర్వాత రెండో రోజున కార్తిక మాసం మొదలవుతుంది. ఎందుకంటే.. శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథినే నెల ప్రారంభానికి సూచనగా తీసుకుంటారు. అమావాస్య తిథి.. నవంబర్​ 12న మొదలై.. నవంబర్​ 13న సోమవారం వరకు ఉంది. నవంబర్​ 14న మంగళవారం సూర్యోదయం సమయానికి పాడ్యమి తిథి ఉండటంతో ఆ రోజు నుంచి ఆకాశదీపం ప్రారంభమవుతోంది. అంటే నవంబర్​ 14వ తేదీ మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతోందని పండితులు చెబుతున్నారు.

కార్తిక మాసం అని పేరు ఎలా వచ్చింది?: చంద్రుడు పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తికమనే పేరు వచ్చింది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా ఇద్దరూ సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో చేసే జపం, ధ్యానం, నదీస్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలూ కలుగుతాయని ప్రజల నమ్మకం.

కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగలు..: 2023 నవంబర్​ 14వ తేదీ మంగళవారం పాడ్యమి తిథితో కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. అదే రోజు గోవర్ధన పూజ కూడా చేస్తారు.

  • నవంబర్ 15 బుధవారం రోజున యమవిదియ- భగినీహస్త భోజనం.
  • నవంబర్​ 17 శుక్రవారం రోజున నాగుల చవితి.
  • నవంబర్​ 20న కార్తీక మాసం మొదటి సోమవారం, కార్తవీర్య జయంతి.
  • నవంబర్​ 22న యాజ్ఞవల్క జయంత్.
  • నవంబర్​ 23న మతత్రయ ఏకాదశి.
  • నవంబర్​ 24న శుక్రవారం క్షీరాబ్ధి ద్వాదశి.
  • నవంబర్​ 26న ఆదివారం జ్వలా తోరణం.
  • నవంబర్​ 27న సోమవారం కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీక పూర్ణిమ.
  • డిసెంబర్​ 4న కార్తీక మాసం మూడవ సోమవారం.
  • డిసెంబర్​ 11న కార్తీక మాసం నాలుగవ సోమవారం.
  • డిసెంబర్​ 13న బుధవారం పోలి స్వర్గం.

సోమవారానికి ప్రాధాన్యత: కార్తిక మాసంలో సోమవారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం అంటే శివుడికీ ఇష్టం కాబట్టి ఈ నెలలో వచ్చే సోమవారాల్లో ఉపవాసం ఉండి, శివుడిని ఆరాధించి.. సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం తరువాత దీపాలను వెలిగించి భోజనం చేస్తే సకల శుభాలూ కలుగుతాయని అంటారు. అంతే కాకుండా ఈ కార్తికంలోనే అయ్యప్ప దీక్షను స్వీకరిస్తారు. కారణం ఏంటంటే.. అయ్యప్పను హరిహరసుతుడిగా భావిస్తారు. మకర సంక్రమణ సమయంలో స్వామి మకరజ్యోతి రూపంలో ఆవిర్భవిస్తాడని
ఓ నమ్మకం. ఆ జ్యోతిని చూసేందుకు మండలంపాటు(41 రోజులు) దీక్షను చేపట్టి స్వామి సన్నిధానానికి చేరుకుంటారు భక్తులు.

భక్తులకు అలర్ట్​ - కార్తిక మాసంలో శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే!

కార్తికమాసం స్పెషల్ - శైవ క్షేత్రాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.