ETV Bharat / bharat

మహిళను చెంప దెబ్బ కొట్టిన మంత్రి.. భూమి గురించి అడిగినందుకు..

భూమి కేటాయించలేదని ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను కర్ణాటకలోని ఓ మంత్రి చెంప దెబ్బ కొట్టారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కాగా.. తర్వాత మంత్రి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.

minister slaps women in karnataka
minister slaps women
author img

By

Published : Oct 23, 2022, 2:31 PM IST

Updated : Oct 23, 2022, 3:54 PM IST

.

తనకు భూమి కేటాయించలేదని ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను మంత్రి చెంప దెబ్బ కొట్టిన ఘటన కర్ణాటకలోని చామరాజ్​ నగర్​లో జరిగింది. హంగాల గ్రామంలో చేపట్టిన భూపంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మౌలిక వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వి.సోమన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 175 మందికి గ్రామీణ ప్రాంతాల్లో భూ క్రమబద్దీకరణకు ఉద్దేశించిన సెక్షన్‌ 94సీ ప్రకారం టైటిల్‌ డీడ్‌లను పంపిణీ చేశారు.

ఈ క్రమంలో దరఖాస్తు చేసుకున్న ఓ మహిళకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ పట్టాను ఇవ్వలేదు. ఈ విషయమై వాగ్వాదానికి దిగిన మహిళను మంత్రి చెంప దెబ్బకొట్టారు. అయినా.. సదరు మహిళ మంత్రి కాళ్లకు దణ్నం పెట్టి తన గోడును వెళ్లబోసుకొంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కాగా.. తర్వాత మంత్రి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.
కర్ణాటకలో భాజపా నాయకులు దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి ఓ మహిళా రైతును తిట్టారు. గత నెలలో భాజపా ఎమ్మెల్యే అరవింద్‌ లింబావలి ఓ మహిళను తిట్టిన వీడియో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: పిల్లలతో కలిసి సీఎం మామయ్య దీపావళి వేడుకలు

పాయింట్​ బ్లాంక్​లో గన్​ గురిపెట్టి రూ.2 లక్షలు దోపిడీ

Last Updated : Oct 23, 2022, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.