ETV Bharat / bharat

గాంధీలు లేకుండా విపక్ష నేతలకు సిబల్ విందు- దేనికి సంకేతం? - kapil sibal dinner updates

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్​ తన నివాసంలో ప్రతిపక్ష నేతలకు సోమవారం రాత్రి విందు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గాంధీలు లేకుండానే ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నం చేయడం వల్ల ఆయనపై పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తన శక్తి సామర్థ్యాలేంటో కాంగ్రెస్ అదిష్ఠానానికి తెలియజేసేందుకే సిబల్ ఈ భేటీ నిర్వహించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. జీ-23 నేతలు గులాం నబీ ఆజాద్​, శశి థరూర్, మనీశ్ తివారీ కూడా సమావేశంలో పాల్గొన్నారు. భాజపాను ఓడించాలంటే ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని, అంతకంటే ముఖ్యంగా కాంగ్రెస్​లో అంతర్గత సమస్యలు పరిష్కరించుకోవాలని భేటీకి హాజరైన నేతలు సూచించినట్లు తెలుస్తోంది.

Kapil Sibal's dinner: An effort for Opposition unity or a show of strength?
గాంధీలు లేకుండా విపక్షనేతలకు సిబల్ విందు
author img

By

Published : Aug 10, 2021, 4:26 PM IST

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఇంకా పరిష్కారం కాకముందే ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్​ ప్రతిపక్ష నేతలతో తన ఇంట్లో సమావేశమయ్యారు. దాదాపు దేశంలోని అన్ని ప్రతిపక్షాల ముఖ్య నాయకులు సిబల్ సోమవారం రాత్రి ఇచ్చిన విందుకు హాజరయ్యారు. దిల్లీలోని తీన్​మూర్తి లేన్​లోని ఆయన నివాసంలోనే ఈ భేటీ జరిగింది.

దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కపిల్ సిబల్​ ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్​ పార్టీ పూర్వవైభవం సాధించాలంటే సంస్థాగతంగా సంస్కరణలు అవసరమని అధిష్టానంపై బాహటంగా అసమ్మతి వ్యక్తం చేసిన జీ-23 నేతల్లో కపిల్ సిబల్​ ముఖ్య నాయకులు. ఈ గ్రూప్​లో ఉన్న సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, శశి థరూర్​, మనీశ్ తివారీ కూడా ఈ భేటీకి హాజరయ్యారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఇంకా అంతర్గత విభేదాలతో సతమతమవుతుండటం గమనార్హం. గాంధీలు లేకుండానే సిబల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​, నేషనల్​ కాన్ఫరెన్స్​ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్​, సమాజ్​వాదీ పార్టీ సీనియర్​ నాయకులు అఖిలేశ్​ యాదవ్​ సహా ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్య కూటమికి దూరంగా ఉన్న ఆకాలీదళ్, బీజేడీ, వైకాపా, తెదేపా నేతలు కూడా సిబల్ నివాసంలో విందుకు హాజరుకావడం ఆసక్తికరంగా మారింది.

రాహుల్​ సమావేశానికి రాని వారు కూడా..

కేంద్రానికి వ్యతిరేకంగా వ్యూహాన్ని రూపొందించేందుకు రాహుల్ గాంధీ ఇటీవలే ప్రతిపక్ష నేతలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి హాజరుకాని పార్టీలను కూడా ఏకం చేసే విషయంలో సిబల్ సఫలీకృతమయ్యారు. కాంగ్రెస్​లో అసమ్మతి వర్గం జీ23 నేతల్లో కీలకంగా ఉన్న ఆయన.. పార్టీలో సంస్థాగత మార్పుల తీసుకురావాలని లేఖ రాసిన తర్వాత కూడా.. సొంత పార్టీ నేతలపై చాలాసార్లు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే తన శక్తి సామర్థ్యాలేంటో కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే సిబల్ ప్రతిపక్ష నేతలతో సమావేశం నిర్వహించారని పార్టీ వర్గాలు తెలిపాయి. తనను పక్కకు పెట్టొద్దనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అయితే కపిల్​ సిబల్ కార్యాలయం మాత్రం ఇందుకు భిన్నమైన ప్రకటన విడుదల చేసింది. ఇది ఆయన వ్యక్తిగత విందు సమావేశం అని, రాజకీయాలతో సంబంధం లేదని తెలిపింది.

మరోపైపు ప్రతిపక్షాలను ఏకం చేయాలని కపిల్ సిబల్ చేసిన ప్రయత్నంపై కాంగ్రెస్ అసహనంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలో నాయకత్వ లోపాన్ని ఎత్తి చూపేలా ఈ చర్య ఉందని పేర్కొన్నాయి.

ఐకమత్యంతోనే..

2024 ఎన్నికల్లో భాజపాను ఎలాగైనా గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరాన్ని వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో స్పష్టం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్​లో అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే డిమాండ్లు కూడా వినిపించినట్లు తెలుస్తోంది. మోదీ సర్కార్​ను ఓడించేందుకు కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన ప్రయత్నాలను లాలూ ప్రసాద్ యాదవ్​, ఒమర్ అబ్దుల్లా వంటి నేతలు కొనియాడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రతిపక్షాల ఐక్యతా కూటమి ఆలోచనకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సానుకూలంగా స్పందించినట్లు ఓ నాయకుడు చెప్పారు. అయితే కపిల్ సిబల్​ లేవనెత్తిన పార్టీ అంతర్గత, ఇతర విషయాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీని బలోపేతం చేస్తే ప్రతిపక్షం మరింత బలపడినట్లేనని ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడినట్లు తెలిపారు.

కాంగ్రెస్​ పార్టీపై అసమ్మతి వెళ్లగక్కిన ఆ పార్టీ 23 మంది సీనియర్ నేతల వర్గమే జీ-23. పార్టీకి పూర్వవైభవం తీసుకురాలంటే సంస్థగాతంగా ప్రక్షాళన అవసరమని వారు బాహాటంగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. గతేడాది ఆగస్టులో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈ విషయంపై లేఖ రాశారు. క్షేత్ర స్థాయి నంచి సీడబ్ల్యూసీ వరకు అన్ని పదవులకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: 'పెగసస్‌'పై పెదవివిప్పిన కేంద్రం- రాజ్యసభలో కీలక ప్రకటన

'కేంద్రంపై ఐక్యంగా ఉద్యమిద్దాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.