తమిళనాడులో ఒకే పాఠశాలలో చదివిన 108 మంది పూర్వ విద్యార్థులు తమ షష్టి పూర్తి వేడుకల్ని ఒకే వేదికపై నిర్వహించుకున్నారు. కళ్లకురిచి ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకున్న వీరంతా ఓ పండగలా తమ షష్టిపూర్తిని జరుపుకొన్నారు. 1977-78 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సుమారు 45 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. అందరికీ 60ఏళ్లు దాటిపోవడంతో కలిసికట్టుగా షష్టిపూర్తి జరుపుకోవాలని నిర్ణయించారు.
అందుకు అనుగుణంగా ఒకే వేదికపై తమ భార్యలను మరోమారు వివాహమాడి ఆనందాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్వవిద్యార్థుల కుమారులు, మనవళ్లు దగ్గర ఉండి చూసుకున్నారు. మరోవైపు, పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి 1987 పదవి విరమణ పొందిన వారిని పూర్వ విద్యార్థులు గుర్తుచేసుకున్నారు. అలాగే విద్యార్థి దశలో తాము చేసిన అల్లర్లు, పొందిన అనుభూతులను పంచుకున్నారు.
ఇవీ చదవండి: థాయిలాండ్ మహిళకు పూనిన కాళీమాత.. భక్తులకు అభయం.. దర్శనానికి స్థానికుల క్యూ..
గర్బా డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి.. మరణాన్ని తట్టుకోలేక తండ్రి సైతం..